English | Telugu

దేవుడేం కళ్ళు మూసుకుని కూర్చున్నాడా...ఇందుకా మేం పూజలు చేసేది!

పుదుచ్చేరిలో తొమ్మిదేళ్ల చిన్నారిపై సామూహిక హత్యాచార ఘటన దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద చాలా మంది సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మహిళా దినోత్సవం, శివరాత్రికి ఒక రోజు ముందు జరిగిన ఈ ఘటనతో తల్లితండ్రులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయం మీద ఇప్పుడు కీర్తి భట్ స్పందించింది. "దేవుడికి  రోజూ మనం పూజలు చేస్తాం...నైవేద్యం పెడతాం...ఎందుకు ఇలా చేస్తాం మమ్మల్ని బాగా చూడాలని..  కష్టాల్లో ఉంటే ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడతాడనే కదా. మరి ఇప్పుడు దేవుడు ఎందుకిలా చేసాడు.