English | Telugu

చెఫ్ మంత్ర సీజన్ 3 లో మెగా డాటర్ నీహారికా...

ఆహా ఓటిటి వేదిక మీద ఎన్నో షోస్, ఈవెంట్స్ , మూవీస్ ఆడియన్స్ ని అలరిస్తుంటాయి... అలాంటి ఈ ప్లాట్ఫార్మ్ మీద కొన్ని నెలల క్రితం వరకు "చెఫ్ మంత్ర" షో నడిచింది. ఈ చెఫ్ మంత్ర అనే కుకింగ్ షో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ సీజన్ లో యాంకర్ గా శ్రీముఖి అదరగొట్టేసి వెళ్ళిపోయింది. సెకండ్ సీజన్ కు మంచు లక్ష్మీ చేసింది. ఇక ఇప్పుడు థర్డ్ సీజన్ కి మెగా డాటర్ నిహారిక ఎంట్రీ ఇచ్చిది. సోషల్ మీడియాలో నిహారిక మంచి యాక్టివ్ గా ఉంటుంది. నిన్న మొన్నటి వరకు రకరకాల ప్లేసెస్ కి ట్రిప్స్ కి వెళ్లి ఫుల్ ఛిల్ అయ్యి వచ్చింది. ఇప్పుడు నిహారిక చెఫ్ మంత్ర సీజన్ 3 ని హోస్ట్ చేయబోతోంది.  దీని ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. "ఈసారి ట్రిపుల్ ఎనెర్జీతో, ట్రిపుల్ ఎంటర్టైన్మెంట్ తో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాం" అని చెప్పింది నిహారిక. ఉమెన్స్ డే రోజున ఈ షో థర్డ్ సీజన్ కి స్టార్ట్ చేయబోతోంది.

సోనియాగాంధీలా శ్రీముఖి...ఇంగ్లీష్ అమ్మాయిలా మంగ్లీ...

సూపర్ సింగర్ షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా అలరించడానికి రాబోతోంది. ఐతే ఈ షోలో ఒక వెరైటీ సెగ్మెంట్ జరిగింది. సూపర్ సింగర్ ఒకవేళ 2050 లో జరిగితే ఎవరెవరు ఎలా ఉంటారో తెలుసా అంటూ ఇప్పటి ఫొటోస్ కి టెక్నాలజీని వాడి ఫ్యూచర్ ఫొటోస్ లో ఎలా ఉంటారో చూపించింది. సోనియాగాంధీ లుక్ లో శ్రీముఖి మంచి ఇంగ్లీష్ కాస్ట్యూమ్ తో నవ్వుతూ కనిపించేసరికి ఆ పిక్ ని చూసిన తెగ సిగ్గు పడిపోయింది. ఇక మంగ్లీ లుక్ ఐతే వేరే లెవెల్ లో ఉంది. ఇంగ్లీష్ వాళ్ళ లుక్ తో  కలర్ ఫుల్ కాస్ట్యూమ్ తో నవ్వుతూ కనిపించిన  ఆ పిక్ చూసి అందరూ షాకైపోయారు. మంగ్లీ తన ఫోటో తానే చూసుకుని తల దించేసుకుని నవ్వేసుకుంది.