100 రూపాయలతో మొదటి ఆల్బం... ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం...
జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. అలాంటి వారిలో రచ్చ రవి కూడా ఒక వ్యక్తి. జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ తో పేరు తెచ్చుకుని తర్వాత మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా బిజీ అయ్యాడు. తెలంగాణ హన్ముకొండ నుంచి ఇండస్ట్రీలో ఒక్కోమెట్టు ఎక్కుతూ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ‘బలగం’ మూవీలో ఆటో డ్రైవర్గా హీరోకి స్నేహితుడిగా నటించాడు. అలాగే గద్దలకొండ గణేష్, ఎంసీఏ, ఒక్కక్షణం, నేనే రాజు నేనే మంత్రి, రాజా ది గ్రేట్ వంటి మూవీస్ లో కూడా నటించాడు రచ్చ రవి.