Guppedantha Manasu: కాలేజీలోకి ఏంజిల్.. మొదలైన కొత్త ప్రేమకథ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1086 లో.. నా తండ్రి ఎక్కడున్నాడో తెలుసుకుంటానని నాకు మాట ఇవ్వండి అని మను అనగానే.. తప్పకుండా తెలుసుకుంటానని మహేంద్ర మాటిస్తాడు. అదంతా చూస్తూ వసుధార, అనుపమ ఇద్దరు కంగారుపడతారు. ఇన్ని రోజులు మనుకి తన తండ్రి ఎవరో తెలిస్తే ఏమవుతుందోనని భయపడేవాళ్ళం ఇప్పుడు మావయ్యకి మను తన కొడుకే అని తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందోనని బయపడుతున్నాం.. మీరు మను గారికి నిజం చెప్పండి అని అనుపమతో వసుధార అంటుంది.