English | Telugu

ఫ్యామిలీ స్టార్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సుధీర్ జూన్ 2 నుంచి

సుడిగాలి సుధీర్ హోస్ట్ గా రిఎంట్రీ ఇస్తున్న " ఫామిలీ స్టార్స్" షో జూన్ 2 నుంచి స్టార్ట్ కాబోతోంది. ఈ షో రాత్రి 7 .30 కి ఈటీవీలో ప్రసారం అవనుంది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "చిన్న గ్యాప్ ఇచ్చాం రా మచ్చా ..ఇప్పుడు చూస్తావ్ గా మనం చేసే రచ్చ" అంటూ సుధీర్ చెప్పాడు. ఈ షోలో ఒకప్పటి బుల్లితెర నటీనటులంతా వచ్చారు.  అందరూ కూడా తమకు లైఫ్ ఇచ్చిన ఈటీవీని తలుచుకున్నారు. మొదట్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో స్టార్ట్ ఐన ప్రోమో గేమ్స్ తో అల్లరితో సాగింది. ఫైనల్ లో మాత్రం అందరి లైఫ్ లో జరిగిన విషయాలు తలుచుకుని, చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో షోలో ఎమోషనల్ పార్ట్ కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజుల్లో షోస్ లో ఒక ఎమోషనల్ సెగ్మెంట్ ని మేకర్స్ పెడుతున్నారు.

చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప

అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది.  అనసూయ ఏం చేసినా అందులో బూతులు వెతికేవాళ్లు బూతద్దాలు పెట్టి వెతికే వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఐతే అవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంది.  మన దేశంలోని 3 రాష్ట్రాలను సందర్శించింది అనసూయ అండ్ ఫామిలీ. అక్కడి ప్రజల గురించి , వారి సంస్కృతి, వారి వంటకాలు గురించి తెలుసుకుంది..అక్కడి రుచులను ఆస్వాదించింది. ఇక అక్కడి ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసింది. ఎన్నో విషయాలను తెలుసుకుంది. అలాగే అక్కడి వాటర్ ఫాల్స్ లో భర్త, పిల్లలతో కలిసి ఆడుకుంది. వెకేషన్ లో ఉన్న అనసూయ నీళ్లలో ఆడుతూ హాట్ పోజులు ఇచ్చింది. కొద్దిరోజులుగా ఫ్యామిలీతో కలిసి అనసూయ వెకేషన్ లో మస్త్ ఎంజాయ్ చేస్తోంది.

ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ లో కళ్ళు తిరిగి పడిపోయిన పెళ్ళికూతురు.. చెక్ చేస్తే ప్రెగ్నెంట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -478 లో.. కృష్ణకి మీరా ప్రెగ్నెంట్ అనే  నిజం తెలిసిపోయి తనని అడుగగా.. నేను ఇదంతా కావాలనే చేశాను. అసలు నీకు పిల్లలు పెట్టుకుండా చేసిందే నేను.. మురారీకి సరోగసి ఐడియా ఇచ్చిందే నేను. ఆ బిడ్డను కడుపులో పెట్టుకుని ఆదర్శ్‌తో పెళ్లి ఏర్పాట్లు చేయిస్తున్నదే నేను అని మీరా చెప్తుంది. ఇంత ఘోరాలు చెయ్యడానికి అసలు నువ్వు ఎవరు? నీకు నా కుటుంబానికి ఏంటి సంబంధమని కృష్ణ నిలదీయగా.. నేనే అసలు ముకుందను.. చనిపోయినట్లుగా మిమ్మల్ని నమ్మించి.. ఇలా రూపం మార్చుకుని మీ ఇంట్లో అడుగుపెట్టాను.. ఈ నిజం ఎవరితోనైనా చెప్పాలని చూస్తే.. నిజంగానే నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది మీరా అలియాస్ ముకుంద.

Karthika Deepam2 : వాడికి విడాకులు ఇవ్వు దీప.. నా కూతురికి సమాధానం చెప్పలేను బాబు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -53 లో......బావని ఎక్కువగా నమ్మేది నేనే.. అలాంటిది బావ గురించి నేనే ఇలా చెప్తున్నానంటే అర్థం చేసుకో మమ్మీ.. బావ పూర్తిగా మారిపోయాడని సుమిత్రతో జ్యోత్స్న అంటుంది. అసలు బావ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదనగానే అప్పుడే దశరథ్ వచ్చి.. నాకు కార్తీక్ అంతా చెప్పాడు.. ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేస్తారు. దాని గురించేం ఆలోచించకని జ్యోత్స్నకి సర్ది చెప్తాడు. నేను ఇప్పుడు నా దారికి తెచ్చుకుంటే మళ్ళీ దీని మైండ్ డైవర్ట్ చేస్తున్నారని పారిజాతం అనుకుంటుంది.

Eto Vellipoyindhi Manasu : ప్రియుడు రాడని తెలిసి మూగబోయిన భార్య‌.. తన భర్త కోసం అక్కడే ఉండగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'.ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -105 లో... రామలక్ష్మి వెళ్తుంటే..  నీకు మంచి భర్త దొరికాడు. అతని చెయ్యి మాత్రం ఎప్పుడు వదలకని సుజాత చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి వాళ్ళు బయటకు వెళ్తారు. సీతాకాంత్ తో సుజాత మాట్లాడుతుంది. రామలక్ష్మి ఎందుకు బాధపడుతుంది. ఎందుకు చెప్పండి అని అడుగుతుంది. తను మీపై బెంగ పెట్టుకుందని సీతాకాంత్ చెప్తాడు. అది కాదని నాకర్థమవుతుందని సుజాత అనగానే.. మీ కూతురు గురించి మీరు టెన్షన్ పడకండి. నేను తనకి కష్టం రాకుండా చూసుకుంటానని సీతాకాంత్ అంటాడు.

Brahmamudi : నీకు అన్యాయం జరిగితే నేను చూస్తూ ఉండలేను.. సుభాష్ కి ఎదురుతిరిగిన మాయ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -418 లో... కళ్యాణ్ గదిలోకి వస్తుంటాడు. మీ వదిన గురించి నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను కానీ చాలా తెలివిగలది.. ఎంత తెలివి అంటే తన సవతిని తీసుకొని వచ్చి.. తన ఇంట్లోనే పెట్టుకుంటుందని అనామిక అంటుంది. వదిన అలా చేసి ఉండొచ్చు కానీ దాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుందని కళ్యాణ్ అంటాడు. ఆ మాయకి మీ అన్నయ్యకి ఆఫీషియల్ గా మ్యారేజ్ చేస్తారు.. ఇక మీ వదినకి ఇంట్లో స్థానం ఉండదు.. ఇదే జరుగుతుంది చూడమని అనామిక అంటుంది. అలా జరగడానికి వీలు లేదని కళ్యాణ్ అంటాడు.