English | Telugu

చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప


అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. అనసూయ ఏం చేసినా అందులో బూతులు వెతికేవాళ్లు బూతద్దాలు పెట్టి వెతికే వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఐతే అవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంది. మన దేశంలోని 3 రాష్ట్రాలను సందర్శించింది అనసూయ అండ్ ఫామిలీ. అక్కడి ప్రజల గురించి , వారి సంస్కృతి, వారి వంటకాలు గురించి తెలుసుకుంది..అక్కడి రుచులను ఆస్వాదించింది. ఇక అక్కడి ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసింది. ఎన్నో విషయాలను తెలుసుకుంది. అలాగే అక్కడి వాటర్ ఫాల్స్ లో భర్త, పిల్లలతో కలిసి ఆడుకుంది. వెకేషన్ లో ఉన్న అనసూయ నీళ్లలో ఆడుతూ హాట్ పోజులు ఇచ్చింది. కొద్దిరోజులుగా ఫ్యామిలీతో కలిసి అనసూయ వెకేషన్ లో మస్త్ ఎంజాయ్ చేస్తోంది.

ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకున్నాం అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను షేర్ చేసింది. ఈ ట్రెక్కింగ్ కు అందరూ కలిసి వెళ్లారు. ఈ ఫొటోలు చూసి నెటిజన్స్ ఎప్పటిలాగే అనసూయ మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ షూటింగ్ తో బిజీబిజీగా గడిపిన అనసూయ.. కాస్త గ్యాప్ దొరకగానే ఇలా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లిపోయింది. రీసెంట్ గా అనసూయ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. డీ గ్లామర్ రోల్ అయినప్పటికీ అనసూయ ఈ పాత్ర కోసం చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసినట్లు తెలుస్తోంది. పుష్ప 2లో అనసూయ పాత్ర డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది అంటే పుష్పరాజ్ ని అంతం చేసే పాత్రలో కనిపించబోతోందట. మరి అనసూయకు పుష్ప 2 లో మంచి రోల్ పడినట్లే అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.