English | Telugu

ఫ్యామిలీ స్టార్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సుధీర్ జూన్ 2 నుంచి


సుడిగాలి సుధీర్ హోస్ట్ గా రిఎంట్రీ ఇస్తున్న " ఫామిలీ స్టార్స్" షో జూన్ 2 నుంచి స్టార్ట్ కాబోతోంది. ఈ షో రాత్రి 7 .30 కి ఈటీవీలో ప్రసారం అవనుంది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "చిన్న గ్యాప్ ఇచ్చాం రా మచ్చా ..ఇప్పుడు చూస్తావ్ గా మనం చేసే రచ్చ" అంటూ సుధీర్ చెప్పాడు. ఈ షోలో ఒకప్పటి బుల్లితెర నటీనటులంతా వచ్చారు. అందరూ కూడా తమకు లైఫ్ ఇచ్చిన ఈటీవీని తలుచుకున్నారు. మొదట్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో స్టార్ట్ ఐన ప్రోమో గేమ్స్ తో అల్లరితో సాగింది. ఫైనల్ లో మాత్రం అందరి లైఫ్ లో జరిగిన విషయాలు తలుచుకుని, చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో షోలో ఎమోషనల్ పార్ట్ కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజుల్లో షోస్ లో ఒక ఎమోషనల్ సెగ్మెంట్ ని మేకర్స్ పెడుతున్నారు.

ఆడియన్స్ కి కనెక్ట్ కావడానికి సెలబ్రిటీస్ లైఫ్ లో జరిగిన ట్రాజెడీతో ఎమోషన్ ని పండించిందనికే ఫస్ట్ ప్రిఫెరెన్స్ ఇస్తున్నారు. ఇది ఇలా ఉంటే బుల్లితెర మీద మధ్యాహ్నం శ్రీదేవి డ్రామా కంపెనీతో షోతో రష్మీ, రాత్రి ఫామిలీ స్టార్స్ షోతో సుధీర్ కనిపించబోతున్నారు. ఇక సుధీర్ ఎంట్రీకి ఫాన్స్ ఫిదా ఐపోతున్నారు. సుధీర్ షో చేస్తున్నాడంటే అది బ్లాక్ బస్టరే అంటున్నారు ఆడియన్స్. సుధీర్ ఆల్రెడీ ఆహాలో సర్కార్ సీజన్ 4 కు యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ షోతో ఈటీవీలో హోస్ట్ గా రాబోతున్నాడు. ఇక ఇందులో సుధీర్ డ్రెసింగ్ స్టైల్ వేరే లెవెల్ లో ఉంది. కళ్ళజోడు, గడ్డం, మెడలో చైన్ , కూల్ డ్రెస్ ఇలా డిఫరెంట్ లుక్ తో అమ్మాయిల మనసును దోచేసుకుంటున్నాడు సుధీర్.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.