English | Telugu
అస్సలు సిగ్గుపడకండి...తింటూ థ్రెడ్ మిల్ చేసేవాళ్ళు మల్టీటాస్కర్స్
Updated : May 25, 2024
దీపికా రంగరాజు ఎక్కడుంటే అక్కడ అల్లరే అల్లరి..షోస్ లో ఐతే మరీ సందడి చేసేస్తుంది. ఇక దీపికా బ్రహ్మముడి సీరియల్ ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఒక భోళా మనిషి. ఇన్స్టాగ్రామ్ లో చేసిన చిలిపి పనులు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా అలాంటి ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఎవరైనా జిమ్ కి వెళ్లి ఎం చేస్తారు. ముందు రోజు తిన్న తిండి మొత్తం కొవ్వులా మారకుండా ఉండడానికి వర్కౌట్స్ చేస్తారు. కానీ దీపికా చూడండి ఎం చేస్తోందో..జిమ్ కి అర్థాన్ని మార్చేసింది. ఒక చేతిలో క్రీం బన్, రెండో చేతిలో సమోసా...స్వీట్, హాట్ ని ఏకధాటిగా లాగించేస్తూ మరో వైపు థ్రెడ్ మిల్ చేసేస్తోంది. అంటే రెండు చేతులు, రెండు కాళ్ళు, నోరు అస్సలు ఖాళీగా లేదు దీపికాకు..పైపెచ్చు తన ఈ ఈటింగ్ వర్కౌట్ కి వెరైటీ కాప్షన్ మళ్ళీ. "అస్సలు సిగ్గుపడకుండా ఉండండి. ఫుడీస్ కి ఇదే బెస్ట్ ఆప్షన్...అంటే తినడం...క్యాలోరిస్ బర్న్ చేయడం ఒకేసారి చేసే ఆప్షన్" అంటూ మల్టీ టాస్కర్స్, నో గిల్టీ అనే పదాలకు హ్యాష్ ట్యాగ్స్ పెట్టి మరీ అమ్మడు సమాజానికి ఒక కొత్త సందేశాన్ని ఇస్తోంది. ఇక నెటిజన్స్ ఐతే "మొత్తానికి అక్కడ కూడా తగ్గేది లేదు అని రుజువు చేశావ్ కదా అల్లరిపిల్ల, బాబోయ్ ఎక్కడి నుంచి వస్తాయండి ఇలాంటి ఐడియాస్, దీపుకి మాత్రమే సొంతం ఇలాంటి ఐడియాస్, దీపు మీరు ఎక్కడుంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ మరి, ఫిట్నెస్ మంచిదే కానీ తింటూ ఏంటి తల్లి, మీకు సరిపోయే రీల్స్ చేస్తున్నారు.." అంటూ సరదా కామెంట్స్ పెడితే ఇంకొంతమంది తిడుతున్నారు ఇలా చేయకూడదు అంటూ..ఏదేమైనా దీపికా రీల్స్ మంచి రెఫ్రెషింగ్ అని చెప్పొచ్చు.