English | Telugu

మిస్ యూ డాడ్..  రిషి ఎమోషనల్ పోస్ట్!

స్టార్ మా టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనసుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆన్ స్క్రీన్ మీద రిషి, మహేంద్రల బాండింగ్, జగతి మేడమ్ నటన, వసుధారతో లవ్ ట్రాక్ అన్నింటిని జనాలు ఎక్కువగా ఇష్టపడేవారు. ఇక ఈ సీరియల్ గత కొంతకాలంగా రిషి, జగతి లేకుండానే నడుస్తుంది.

రిషి అలియాస్ ముఖేష్ గౌడ గతకొంతకాలంగా పర్సనల్ రీజన్స్ వల్ల‌ ఈ సీరియల్ కి బ్రేక్ తీసుకున్నాడు. ఇక త్వరలోనే అతను వస్తాడంటూ మేకర్స్ దర్శకుడు ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని రోజుల క్రితం చెప్పారు. అయితే ఈ సీరియల్ ప్రస్తుతం వసుధారా, రాజీవ్, శైలేంద్ర, దేవయాని, ఫణీంద్ర, మహేంద్ర, ధరణి, ఏంజిల్, మనులతో సాగుతోంది. తాజాగా రిషి తండ్రి మహేంద్ర అలియాస్ సాయి కిరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లతో ముచ్చటించాడు. గుప్పెడంత మనసు ఫ్యాన్స్ రిషి గురించి అడిగారు. ముఖేష్ గురించి మాట్లాడండి అని నెటిజన్లు కోరడంతో.. రిషి చాలామంచి మనిషి.. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి.. హార్డ్ వర్క్ చేస్తాడు.. వెరీ హిలేరియస్ పర్సన్ అంటూ అతనితో తనకున్న అనుబంధాన్ని సాయికిరణ్ అలియాస్ మహేంద్ర నెటిజన్లతో పంచుకున్నాడు.

మహేంద్ర ఈ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో లో షేర్ చేయగా.. ముఖేష్ గౌడ స్పందిస్తూ.. నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నానంటూ హార్ట్ సింబల్‌ని షేర్ చేశాడు. దాన్ని మహేంద్ర తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాడు. ఇక ఇది చూసిన ఫ్యాన్స్.. మీరు మళ్లీ రావాలి.. మీ తండ్రీకొడుకులు గుప్పెడంత మనసు ఫ్యాన్స్‌ని కనువిందు చేయాలని కామెంట్ల మోత మోగిస్తున్నారు. అయితే సీరియల్ విషయానికి వస్తే.. రిషిని వెతికి తీసుకొస్తానంటు వసుధార ప్రామిస్ చేసింది. ఫ్యాన్స్ మాత్రం రిషి అలియాస్ ముఖేశ్ గౌడ ఎంట్రీ కోసం చూస్తున్నట్టు తెలుస్తుంది.