English | Telugu
Karthika Deepam 2 : బ్రతికున్న నాన్నకి పిండం పెడితే ఎలా .. షాక్ లో దీప!
Updated : May 26, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -54 లో.. కార్తీక్, దీపలను ఉద్దేశించి.. వాళ్ళు భార్యాభర్తల్లాగా ఎలా వచ్చారో చూసావ్ కదా అని అనసూయతో నరసింహ అంటాడు. నిన్ను పోలీసులు ఒళ్ళంతా కొట్టినా.. ఆ నొప్పి కంటే వాళ్ళు వచ్చారని ఎక్కవ ఉన్నట్టుందని శోభ అనగానే.. ఎందుకు వాణ్ణి రెచ్చగొడుతావని అనసూయ అంటుంది.
ఆ తర్వాత శోభ రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటే.. శోభపై నరసింహ చెయ్ ఎత్తుతాడు. ఈ ప్రాబ్లమ్ నుండి మా అమ్మనే కాపాడగలదని శోభ కోపంగా లోపలికి వెళ్తుంది. ఆ దీప నాపై కేసు పెట్టింది.. అసలు దానికి వాడికి నా పేరు తియ్యాలంటేనే వణుకుపుట్టేలా చేస్తానని నరసింహ అనగానే.. ఇప్పటి వరకు జరిగింది చాలు.. ఇక వదిలేయ్. రేపు జరగాల్సిన కార్యక్రమం చూడమని అనసూయ అనగానే.. రేపు ఏంటని నర్సింహ అంటాడు. రేపు మీ మావయ్య సంవత్సరికం.. అది నువ్వే చేయాలని అనసూయ అంటుంది. ఆ దీప చేసుకుంటుందని నర్సింహ అనగానే.. దీప సొంత కూతురు కాదని చెప్పబోతు అనసూయ ఆగిపోతుంది. మరొకవైపు వాళ్ళ నాన్న సంవత్సరికానికి దీప అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
ఆ తర్వాత పారిజాతం కోసం బంటు వస్తాడు. అప్పుడే శౌర్య ఎదరుపడి నువ్వు వెళ్లిపోయావన్నారు.. మళ్ళీ ఎప్పుడు వచ్చావని బంటుని శౌర్య అంటుంది. అమ్మగారు ఎక్కడ అని బంటు అడుగుతాడు. గదిలో ఉంటుంది పద అంటూ శౌర్యా తీసుకొని వెళ్తుంది. లోపలికి వెళ్లేసరికి పారిజాతం బ్లాక్ ఫేస్ షీట్ వేసుకొని ఉండేసరికి.. భయపడి బయటకు వస్తారు. ఆ తర్వాత శివన్నారాయణ చూసి.. నువ్వు అలా కంటే ఇలానే బాగున్నావని అంటాడు. ఆ తర్వాత నర్సింహ, దీపలు.. దూరం కావాలని ఈ కేసు పెట్టారని బంటు అంటాడు. అంటే దీపకి కార్తిక్ దగ్గర అవ్వడానికా? అలా జరగద్దు.. ముందు దీప మనసులో ఏముందో కనుక్కోవాలని పారిజాతం అంటుంది. మరొకవైపు దీప తన నాన్నకి పిండం పెట్టగా.. పక్షులు ముట్టవు. అప్పుడే ఒకతను వచ్చి బ్రతికున్నవాళ్లకు పిండం పెడితే కాకులు ఎలా ముడతాయని అనగానే దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.