English | Telugu
100 రూపాయలతో మొదటి ఆల్బం... ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం...
Updated : May 26, 2024
జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. అలాంటి వారిలో రచ్చ రవి కూడా ఒక వ్యక్తి. జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ తో పేరు తెచ్చుకుని తర్వాత మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా బిజీ అయ్యాడు. తెలంగాణ హన్ముకొండ నుంచి ఇండస్ట్రీలో ఒక్కోమెట్టు ఎక్కుతూ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ‘బలగం’ మూవీలో ఆటో డ్రైవర్‌గా హీరోకి స్నేహితుడిగా నటించాడు. అలాగే గద్దలకొండ గణేష్, ఎంసీఏ, ఒక్కక్షణం, నేనే రాజు నేనే మంత్రి, రాజా ది గ్రేట్ వంటి మూవీస్ లో కూడా నటించాడు రచ్చ రవి. అలాంటి రవి రీసెంట్ గా తన స్టార్టింగ్ డేస్ ని ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ వాటిని తన ఫాన్స్ తో షేర్ చేసుకోవడం కోసం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.
"సినిమా అవకాశాల కోసం వెళ్లినప్పుడు నా మిత్రులు వంశీకృష్ణారెడ్డి... మర్ఫీ.... నువ్వు ఏం చేయగలవో ఆడిషన్ లో చేసి చూపించాలి... దాంతోపాటు నీ హావాభావాలు , ముఖకవళికలు తెలిసేటట్టు ఒక ఆల్బమ్ కావాలని చెప్పినప్పుడు..నా రంగుల ప్రపంచం కోసం వంశీకృష్ణారెడ్డి సహకారంతో ఆల్బమ్ కోసం వంద రూపాయలు రెడీ చేసుకుని ఒక ఫోటోగ్రాఫర్ ని దొరకబుచ్చుని 100 రూపాయలు ఇచ్చి తీసుకున్న నా మొదటి ఆల్బమ్ ఇది ...అలనాటి నా జ్ఞాపకం మీతో పంచుకోవాలని ఇలా.. శుభ సాయంత్రం మిత్రులారా" అంటూ ఒక హార్ట్ టచింగ్ కామెంట్ పెట్టాడు.
జబర్దస్త్ ఆర్టిస్టుగా, స్టాండప్ కమెడియన్‌గా, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా, స్కిట్ రైటర్‌గా రవి లైఫ్ జర్నీ కొత్త కమెడియన్స్ కి ఎంతో ఇన్స్పిరేషన్ కూడా. జబర్దస్త్ స్కిట్స్ లో ‘శాంతాభాయ్’గా అలరించినా, ‘తీసుకోలేదా రెండు లచ్చల కట్నం’ అంటూ దెప్పిపొడిచినా ఆయనకే సొంతం. ఇక రచ్చ రవి పిక్స్ చూసిన నెటిజన్స్ ఐతే "ఎనర్జీలో, స్మైల్ లో తేడా ఏమీ లేదు..అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా సేమ్... " అంటున్నారు.