English | Telugu

గుప్పెడంత మనసు సీరియల్ ఐపోతోందా ?



జగతి మేడం అలియాస్ జ్యోతి పూర్వజ్ వెళ్ళిపోయాక గుప్పెడంత మనసు సీరియల్ కొంత రేటింగ్ తగ్గిపోయింది. ఆ తర్వాత రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడ వెళ్ళిపోయాక పూర్తిగా తగ్గిపోయింది. ఇక సీరియల్ టైమింగ్స్ లో మార్పులు చేర్పులతో గందరగోళమయ్యింది గుప్పెడంత మనసు సీరియల్ పరిస్థితి. ఐతే వీళ్లిద్దరి గురించి మహేంద్ర సర్ అలియాస్ సాయి కిరణ్ చాలా బాగా చెప్పాడు. "ముఖేష్ గురించి మీ అభిప్రాయం" అని ఒక నెటిజన్ అడిగేసరికి "చాల మంచి మనిషి తను...చాలా డిసిప్లిన్ కూడా..ఇంకా హార్డ్ వర్కింగ్ కూడా...మంచి హిలేరియస్ కామెడీని అందించే మనిషి.." అని చెప్పాడు.

అలాగే "జ్యోతి మేడం గురించి మీ అభిప్రాయం. మీరు మీ జగ్గుని మిస్ అవుతున్నారా" అని ఇంకో నెటిజన్ అడిగేసరికి "ఆమె చాలా డిగ్నిఫైడ్ పర్సన్...సిన్సియర్ అండ్ అమేజింగ్ ఆర్టిస్ట్ అన్నాడు. ఇక రక్షా గురించి అడిగేసరికి "తను నా చోటూ..యూనిట్ లో మా బాండింగ్ చాలా గట్టిగా ఉంటుంది." అని చెప్పాడు. "గుప్పెడంత మనసు సీరియల్ పూర్తైపోవచ్చిందా" అని అడిగేసరికి "లేదు. కానీ ఏ స్లాట్ లో టెలికాస్ట్ చేసినా ఆ స్లాట్ కి లీడర్ గుప్పెడంత మనసు" అని చెప్పాడు. "నాకు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అంటే ఇష్టం..నా వయసు 69 . ముఖేష్ గురించి నాకేం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా..చిన్న పిల్లలతో నాకేం పని నాకు జగతి అంటే ఇష్టం..రిషి సర్ వసుధారాకు పెయిర్ కదా మిస్ అవకుండా ఎందుకు ఉంటుంది " అంటూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నలన్నిటికీ వరసగా సమాధానం చెప్పాడు. కార్తీక దీపం సీరియల్ తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ కి అదే రేంజ్ లో మంచి రేటింగ్ వచ్చింది. కానీ సడెన్ గా రెండు మెయిన్ క్యారెక్టర్స్ వెళ్లిపోయేసరికి సీరియల్ డల్ ఐపోయింది.