English | Telugu

Eto Vellipoindi Manasu: భార్య సూసైడ్ చేసుకుంటుందేమోనని భర్త కంగారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -106 లో.. అభి కోసం ఈ నాటకం ఆడాం.. ఇప్పుడు అభి రాడని తెలిసాక ఇక ఎందుకు.. ఇక్కడ ఉండాల్సిన అవసరమేంటని రామలక్ష్మి అంటుంది. నా కోసం ఇక్కడే ఉండు.. నాకు నువ్వు హెల్ప్ చేసావ్.. నీకు నేను హెల్ప్ చేయాలి కదా.. అభితో నీ జీవితం మొదలు కాలేదు.. అతనితోనే ఎండ్ అవడానికి అని సీతాకాంత్ చెప్తాడు.

నీ విలువైన కన్నీళ్లు అనేవి విలువ లేని వాళ్ళ కోసం వేస్ట్ చెయ్యకని రామలక్ష్మిని సీతాకాంత్ మోటివేట్ చేస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి కన్నీళ్లు సీతాకాంత్ తుడుస్తుంటే.. అప్పుడే సిరి వస్తుంది.‌అయ్యో రాంగ్ టైమ్ లో వచ్చానని అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్తాడు. మరొకవైపు అగ్రిమెంట్ పేపర్స్ తీసుకున్నాను.. ఇక ఫ్యూన్ ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదని సీతాకాంత్ చైర్ లో మాణిక్యం కూర్చొని ఉంటాడు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఇక ఉద్యోగం చెయ్యాలిసిన అవసరం లేదు. ఇదిగో అగ్రిమెంట్ పేపర్స్ అంటూ చింపేస్తాడు. మాణిక్యం వెళ్తుంటే సీతాకాంత్ ఆపి.. ఇదిగో ఒరిజినల్ అగ్రిమెంట్ పేపర్స్ అని చూపించిగానే మాణిక్యం షాక్ అవుతాడు. ఆ తర్వాత ఫ్యూన్ గెటప్ లోకి మాణిక్యం మళ్లీ చేంజ్ అవుతాడు.

ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి స్వామి పంపిన వ్యక్తి వచ్చి.. ఇవి నీ భార్యకి.. అమ్మవారి దగ్గర పూజ చేసిన చీర పంపారు. ఆమెకి ఇప్పుడు బాలేదు.. ఇబ్బంది ఉందని అతను చెప్తాడు. సీతాకాంత్ వెంటనే రామలక్ష్మి డల్ గా ఉందని.. ఏమైనా చేసుకుంటుందేమోనని కంగారుగా వెళ్తాడు. రామలక్ష్మి టాబ్లెట్లు వేసుకొని సూసైడ్ చేసుకున్నట్లు సీతాకాంత్ ఉహించుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి టాబ్లెట్లు వేసుకుంటుంటే అప్పుడే సీతాకాంత్ వచ్చి.. పడేసి రామలక్ష్మిని కొట్టబోతాడు. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నావంటూ అడుగుతాడు. అయ్యో నేను నిద్ర రావట్లేదని ట్యాబ్లెట్ వేసుకుంటున్నాని రామలక్ష్మి చెప్తుంది. నువ్వు ఏదయిన చేసుకుంటావేమోనని కంగారుపడ్డానని సీతాకాంత్ అంటాడు. నేను అంత పిరికిదాన్ని కాదని రామలక్ష్మి అంటుంది. రామలక్ష్మి ఆలోచనల నుండి ఫ్రీ అవ్వాలని తనతో రూమ్ క్లీన్ చేయిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మికి సీతాకాంత్ టీ తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.