English | Telugu

Brahmamudi : బాబు తండ్రి రాజ్ అని చెప్పిన మాయ.. షాక్ లో దుగ్గిరాల కుటుంబం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -415 లో....పంతులు గారు తీసుకొని వచ్చిన అక్షింతలు అందరు భర్తలు తీసుకొని తమ భార్యలని ఆశీర్వదిస్తారు. రాజ్ కావ్యని ఆశీర్వదిస్తుండగా.. రాజ్ ఏమైనా ఏకాపత్ని వ్రతుడా అని రుద్రాణి అంటుంది. దాంతో కావ్య స్వప్న ఇద్దరు రుద్రాణికి మంచి కౌంటర్ ఇస్తారు. నా భర్త ఎప్పటికి నాకు శ్రీరామచంద్రుడే అని కావ్య అని రాజ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత అనామిక అక్షింతలు తీసుకొని బయట కవితలు రాసుకుంటున్న కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. నన్ను ఆశీర్వాదించండి అని అనామిక అనగాన..  కళ్యాణ్ తనని తిట్టి ఆశీర్వదించకుండా వెళ్ళిపోతాడు.

Guppedantha Manasu : కొడుకు కోసం తల్లి కన్నీటి పర్యంతం.. నాన్నెవరో చెప్పగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1079 లో.... మనుని మహేంద్ర ఇంటికి తీసుకొని వస్తాడు. మనుని చూసిన అనుపమ ఎమోషనల్ అవుతుంది. మనుతో మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. ఇప్పటికైన మనుతో మాట్లాడండని అనుపమతో వసుధార అన్నా కూడా అనుపమ సైలెంట్ గా ఉంటుంది. ఆవిడ ప్రేమ, కోపం, ఆవేశం అంతా నాకు తెలుసు కానీ ఒకే ఒక ప్రశ్నకి సమాధానం తప్ప.... ఆ ప్రశ్న నా తండ్రి ఎవరు అనేది.. ఆవిడా చెప్పదు.. అది నాకు అర్థం కాదు.. మేడమ్ మీరు నా గురించి ఆలోచించకండి నేను బాగుంటానని అనుపమతో మను అంటాడు.

అమ్మో సదా...ఇంత టాలెంటెడ్ ఆ ...

డైరెక్టర్ తేజ తెరకెక్కించిన 'జయం' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సదా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం సదాకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. కానీ టీవీ రియాల్టీ షోలు, డ్యాన్స్ షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. మరోవైపు ఆమె వయసు  39 ఏళ్లకు చేరుకుంది. ఐనా ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. రీసెంట్ గా ఆమె నీతోనే డాన్స్ 2 . 0 షోకి జడ్జ్ గా వ్యవహరిస్తోంది. శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ షోలో ఈ వారం సదా తన టాలెంట్ మొత్తాన్ని చూపించింది. ఈ శనివారం జరిగిన ఎపిసోడ్ లో అమరదీప్ - తేజు జోడీగా చేసిన కథక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దాంతో సదా కూడా స్టేజి మీదకు కథక్ చేసి అందరితో వ్వావ్ అనిపించుకుంది. ఇక ఆదివారం ఎపిసోడ్ లో యావర్-వాసంతి కృష్ణన్ జోడి లావణి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.

ఐదేళ్ల ప్రేమాయణం...ఫైమాకి రింగ్ పెట్టేసిన లవర్

జబర్దస్త్ ఫైమా అంటే ఆడియన్స్ కి పరిచయమే. బుల్లితెర మీద సోషల్ మీడియాలో అమ్మడు ఫుల్ పాపులర్.  రీసెంట్ గా ఫైమా పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆమెకు చాలా మంది విషెస్ చెప్పారు. అలాగే ఆమె ప్రియుడు ప్రవీణ్ కూడా బర్త్ డే విషెస్ చెప్పాడు. జబర్దస్త్ కమెడియన్స్ , ఫాన్స్, ఫాలోవర్స్ అంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఐతే బర్త్ డే రోజున ఫైమా లవర్ ప్రవీణ్ నాయక్  స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఫైమా చేతికి రింగ్ పెట్టాడు. అలాగే రెడ్ కలర్ హార్ట్ సింబల్ పిల్లో కూడా ఇచ్చాడు. ఆ పిక్స్ చూసి అంతా  ఎంగేజ్మెంట్ అయ్యిందా అక్కా  అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రవీణ్ నాయక్ పెట్టిన కాప్షన్ కూడా ఎంగేజ్మెంట్ ఐపోయిందనే అర్థాన్నీ ఇస్తోంది.  “హ్యాపీ బర్త్ డే మై లవ్.. అప్పుడే ఐదేళ్లు గడిచిపోయాయి. ఎలా గడిచిపోయాయో  తెలీదు. నా జీవితం మొత్తం నీతో గడపాలని ఉంది. ఐ లవ్ ఫరెవర్ కన్నా” అంటూ రాసుకొచ్చాడు.