English | Telugu

Karthika Deepam2 : స్కూల్ కి వెళ్ళిన శౌర్య మిస్సింగ్.. వెతికే పనిలో ఆ ముగ్గురు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -61 లో..... ఈ రోజు వెళ్ళేటప్పుడు దీప హోటల్ లో టీ తాగి వెళ్ళాలని కార్తిక్ అనుకుంటాడు. మళ్ళీ వద్దులే నాకు ఏ దూరుద్దేశం లేకపోయిన చూసేవాళ్ళు అలా అనుకోరు కదా అని తానే మళ్ళీ అనుకుంటాడు. అపుడే జ్యోత్స్న కార్తీక్ దగ్గరికి వస్తుంది. మీలాంటి మా లాంటి వాళ్ళ ఆఫీస్ కు సరదాగా వస్తారా అని కార్తీక్ అంటాడు. ఏంటి బావ మీ లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళ అని వేరువేరుగా మాట్లాడుతున్నావని జ్యోత్స్న అంటుంది. నన్ను నువ్వు దూరం చేస్తున్నావా.. నాకు దూరం అవుతున్నావా అని జ్యోత్స్న అనగానే.. ఇద్దరం ఇక్కడే ఉన్నాం వరుసకు బావమరదలు అయిన బిజినెస్ లో మీరు టాప్ పోసిషన్ లో ఉన్నారు.. ఇప్పుడే నేను బిజినెస్ మొదలు పెట్టానని కార్తీక్ అంటాడు.

Brahmamudi : నిజం బయటకు రాకూడదని మాయని కారుతో ఆక్సిడెంట్ చేసిన రుద్రాణి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -426 లో... కావ్య గురించి అనామిక తప్పుగా మాట్లాడుతుంటే కళ్యాణ్ కి కోపం వస్తుంది. నువ్వు కోటి జన్మలు ఎత్తినా కూడా మా వదినని అర్థం చేసుకోలేవని అనామికని కళ్యాణ్ కోప్పడతాడు. ఆ తర్వాత ఇంత కష్టపడి ప్లాన్ చేసి బట్టలు సర్దకున్న కానీ రాజ్ గదిలోకి వెళ్లలేకపోయానని మాయ చిరాకు పడుతుంటే.. నువ్వు ఒకరకంగా సక్సెస్ అయ్యావ్.. పెళ్లి అయిన తర్వాత పంపిస్తానని వదిన చెప్పింది కదా.. ఈ మాత్రం సాధించవంటే గ్రేట్ కదా అని మాయతో రుద్రాణి అంటుంది.

హైపర్ ఆదిని వణికించిన రష్మి.. పిల్లాడికి మ్యాజిక్ రాదు!

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఆది, ఇంద్రజ, రష్మీ ముగ్గురూ స్టేజి మీద ఉండగా ఒక పిల్లాడు ఏడుస్తూ వచ్చాడు. "ఏమయిందిరా..అమ్మ తప్పిపోయిందా..వారిలో ఎవరు " అంటూ రష్మీ, ఇంద్రజ వైపు చూపించేసరికి ఇద్దరూ షాకయ్యారు. తర్వాత ఆ పిల్లాడు ఇంద్రజ, రష్మీ దగ్గరకు వెళ్ళాడు..  ఆ పిల్లాడి చేతిలో ఉన్న పేపర్ తీసుకుని చూసేసరికి అందులో ఆది బొమ్మ కనిపించింది. "ఎం కావాలి ఆది  నుంచి" అని ఇంద్రజ ఆ పిలాడిని అడిగేసరికి వాడు కాస్తా " నాన్న" అన్నాడు. దానికి ఆది షాక్ అయ్యి కౌంటర్ కామెంట్ చేసాడు "ఏరా నీకు మ్యాజిక్ వచ్చా" అని ఆ పిల్లాడిని అడిగాడు. రాదు అని బాబు చెప్పేసరికి ఐతే  కాదులే అంటూ రష్మీ వైపుకు చూసాడు ఆది.. అంటే సుధీర్ రష్మీ పిల్లాడు అన్నట్టుగా ఇన్డైరెక్ట్ గా కౌంటర్ వేసాడు..