Eto Vellipoyindhi Manasu : ప్రమాదం నుండి భార్యని కాపాడుకున్న భర్త.. ఇది అత్త ప్లానేనా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -120 లో....రామలక్ష్మికి ఏమైనా అవుతుందేమోనని సీతాకాంత్ భయపడుతుంటే మరొకవైపు సందీప్ , మాణిక్యం ఇద్దరు గొడవ పడతారు. దాంతో సీతాకాంత్ కోపంగా అందరు ఇక్కడ నుండి వెళ్లిపోండి.. రామలక్ష్మికి ఈ సిచువేషన్ రావడానికి కారణం మీరే అని సీతాకాంత్ కోప్పడతాడు. మా అమ్మాయిని ఆ సిచువేషన్ లో వదిలేసి ఎలా బయటకు వెళ్తామని సుజాత అనగానే.. రామలక్ష్మి ని చూసుకోవడం నా బాధ్యత మీరు వెళ్ళండని మాణిక్యం వాళ్ళని బయటకు పంపిస్తాడు సీతాకాంత్.