English | Telugu

Brahmamudi : హార్ట్ ఎటాక్ తో అత్త హాస్పిటల్ కి.. ఆ నిజం చెప్పేసిన మామ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -433 లో.... సుభాష్ దగ్గరికి అపర్ణ వచ్చి జరుగుతుంది మన అబ్బాయి పెళ్లి.. ఇక్కడేం చేస్తున్నారని ఆడుగుతుంది. ఈ పెళ్లి ఎలా ఆపాలని ఆలోచిస్తున్నానని సుభాష్ అనగానే.. అపర్ణ షాక్ అవుతుందిమ అయితే మీకు నాపై చాల కోపం ఉండాలే అని అపర్ణ అనగానే.. కోపం కాదు జాలిగా ఉందని సుభాష్ అంటాడు. అసలు నిజం తెలిస్తే నువ్వు ఏమైపోతావో అని నా టెన్షన్ అని సుభాష్ అనుకుంటాడు. నాపై ఎందుకు అంత జాలి అని అపర్ణ అడుగగా.. అదేం లేదని సుభాష్ అంటాడు. అయితే నా పక్కన వచ్చి నిల్చోండి అని అపర్ణ అనగానే.. నేను రాలేనని సుభాష్ అంటాడు. అప్పుడే రుద్రాణి వచ్చి.. ఇద్దరు పక్కన ఉండి పెళ్లి జరిపించాలి కదా అని అంటుంది. సుభాష్ కి ఇష్టం లేకున్నా అపర్ణ బలవంతంగా తనని తీసుకొని వెళ్తుంది.

మరొకవైపు కావ్య హాస్పిటల్ లో మాయ గురించి టెన్షన్ పడుతుంటే.. అప్పుడే డాక్టర్ వచ్చి మాయ కోమా లోకి వెళ్ళిందని చెప్పగానే కావ్య షాక్ అవుతుంది. మరొకవైపు ముహూర్తం దగ్గర పడుతుంది కావ్య ఇంకా రావడం లేధని స్వప్న, కళ్యాణ్ , సుభాష్ ఇందిరాదేవి లు బయట వెయిట్ చేస్తుంటారు. అపుడే కావ్య వస్తుంది. అందరు కలిసి లోపలికి వస్తారు. ఏమైందని రాజ్ అడుగగా.. కావ్య రెండు చేతులు జోడించి ఏడుస్తుంది. అప్పుడే ముహూర్తం టైమ్ అయిందని రుద్రాణి అంటుంది. రాజ్ మాయ మెడలో తాళి కట్టబోతుంటే.. అప్పుడే అపర్ణ అంటు సుభాష్ అరుస్తాడు. ఈ పెళ్లి జరగదు.. జరగనివ్వను.. పీటల మీద నుండి లేవవే అని సుభాష్ మాయని అంటాడు. ఎందుకు పెళ్లి జరగనివ్వరని అపర్ణ అడుగుతుంది. అది అసలు మాయ కాదు.. నన్ను నా కొడుకుని బ్లాక్ మెయిల్ చేసి ఈ ఇంటికి కొడలిగా అవుదామని వచ్చిందని.. అసలు నా కొడుకేం తప్పు చెయ్యలేదని సుభాష్ అనగానే.. అందరు ఆశ్చర్యపోతారు. రాజ్, కావ్య వచ్చి సుభాష్ తో నిజం చెప్పొద్దని చెప్తున్నా వినిపించుకోరు. ఇన్ని రోజులు తల్లికోసం ఎన్ని కష్టలు అవమానాలు భరించారు నా కొడుకుకోడలు.. ఇప్పుడు నా కోడలికి అన్యాయం జరిగితే నేను చూస్తూ ఉండలేనని సుభాష్ అంటాడు.

అసలు రాజ్ తప్పు చెయ్యలేదంటే మరి ఆ బాబు ఎవరని అపర్ణ అడుగుతుంది. ఆ బాబుకి తండ్రి రాజ్ కాదు, నేను అని సుభాష్ అనగానే అందరు షాక్ అవుతారు. అపర్ణ మాత్రం అలాగే ఉండిపోతుంది. నేను నా మనసు అదుపులో లేనప్పుడు అలా జరిగింది ఆ బిడ్డని తీసుకొని మాయ వచ్చి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంటే సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను.. దానికి రాజ్ మాయతో మాట్లాడి ఆ బిడ్డని తీసుకొని ఇంటికి వచ్చాడు. నన్ను క్షమించమని సుభాష్ అనగానే.. హార్ట్ ఎటాక్ తో అపర్ణ కిందపడిపోతుంది. వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. అసలు ఆ మాయగా వచ్చింది ఎవరని ధాన్యలక్ష్మి అనగానే.. రుద్రాణి మాయని బెదిరించి ఇంట్లో నుండి పంపించిన విషయం గుర్తుకు చేసుకుంటుంది. తరువాయి భాగంలో మా అమ్మకి ఈ సిచువేషన్ రావడానికి కారణం నువ్వే అని కావ్యని రాజ్ తిడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.