కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్
స్టార్ మాలో త్వరలో ఎక్సయిటింగ్ గేమ్ షో ఒకటి రాబోతోంది. కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్. ఈ షో ప్రోమో చూస్తేనే వారెవ్వా అని అనిపించేలా ఉంది. ఈ షోకి సంబంధించిన ఒక టైటిల్ సాంగ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర మీద రెగ్యులర్ గా ఎంటర్టైన్ చేసే వాళ్ళే ఉన్నారు. అమరదీప్ చౌదరి, యాదమ్మ రాజు, ప్రియాంక జైన్, జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్య, బ్రహ్మముడి హీరోయిన్ దీపికా రంగరాజు, నిఖిల్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, విష్ణుప్రియ, శోభా శెట్టి, ప్రేరణ కంభం, శేఖర్ మాస్టర్, అనసూయ వంటి వాళ్ళు చాలామంది ఈ షోలో కనిపించనున్నారు.