English | Telugu

సోషల్ మీడియా కామెంట్లపై స్పందించిన జ్యోతిరాయ్!


ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండే నటీనటుల గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అందరికి తెలిసిపోతుంది. అందులో కొంతకాలం క్రితం మోస్ట్ వైరల్ గా మారిన జ్యోతిరాయ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. జ్యోతి రాయ్.. ఈ పేరు విని ఉండకపోవచ్చు గానీ జగతి మేడం అంటే తెలియని వారు ఉండరు. స్టార్ మాటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే "గుప్పెడంత మనసు" ప్రేక్షకులకు జగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో అందరిని మెప్పిస్తూ, ఒక తల్లిగా కొడుకుపై చూపించే ప్రేమని వ్యక్తపరచడంలో జగతి పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది.

జ్యోతి రాయ్ కన్నడ నటి.. కన్నడలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జీ తెలుగులో ప్రసారమైన 'కన్యాదానం' సీరియల్ లో నిరుపమ్ పరిటాలతో కలిసి మొదటిసారి జ్యోతిరాయ్ నటించింది. ఆ తర్వాత 'గుప్పెడంత మనసు' సీరియల్ లో ప్రస్తుతం నటిస్తుంది. గత కొంతకాలం నుండి గుప్పెడంత మనసు సీరియల్ టాప్ రేటింగ్ లో ఉంటు వస్తుంది. జ్యోతిరాయ్ అలియాస్ జగతి.. అలనాటి నటుడు సాయి కిరణ్ కి భార్యగా గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తన అందంతో పాటు హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది జగతి. జ్యోతి రాయ్ ఒకవైపు ఈ సీరియల్ మరొక పక్క ఒక వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటుంది.

తాజాగా మాస్టర్ పీస్ అనే మూవీ టీజర్ లాంఛ్ లో జ్యోతిరాయ్ తనపై వస్తున్న కామెంట్ల గురించి చెప్పుకొచ్చింది. మీపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్ల గురించి చెప్పండి అని అడుగగా.. ఇక్కడ తెలుగువాళ్ళకి ' గుప్పెడంత మనసు' సీరియల్ లో పద్ధతిగా చీర కట్టుకొని ఉండటం తెలుసు. కానీ మాడల్ అంటే అన్ని పాత్రలు చేయాలి.. నేను ఇలాగే ఉంటాను అంటే కుదరదు. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ఏ పాత్ర అయినా చేయాలి. కన్నడ లో ఇలాంటి రోల్స్ చేశాను. కానీ ఇక్కడి వారికి తెలియదు. వాళ్ళు చేసే కామెంట్లని నేనేమీ అనుకోను. నాకు ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉంటానని జ్యోతిరాయ్ అంది. ఇక ఈ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా నెటిజన్లు పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.