టేస్టీ తేజకి సర్ ప్రైజ్ ఇచ్చిందెవరో తెలుసా!
బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో తేజ ఒకడు. తేజ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు జబర్దస్త్ లో కమెడియన్ గా నటించాడు. ఐతే ఈరోజు తేజ ఇలా ఒక సెలబ్రిటీ స్థాయికి రావడానికి కారణం జబర్దస్త్ టీమ్ లీడర్ అదిరే అభి అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన లేకపోతే తనసలు ప్రజలకు తెలిసేవాడినే కాదన్నారు తేజ. ఇటు బుల్లితెరతో పాటు అటు సోషల్ మీడియాలో కూడా తేజకు మంచి ఫాలోయింగ్ ఉంది. తేజ తన యూట్యూబ్ ఛానెల్ లో 200కి పైగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రమోట్ చేశాడు. ఐతే జబర్దస్త్ లో కనిపించినా, బిగ్ బాస్ లో కనిపించినా ఫ్యూచర్ చాల బ్రైట్ గా ఉంటుంది అనడానికి చాలా మంది ఉదాహరణులుగా ఉన్నారు.