English | Telugu
సద్దు...ఒక ముద్దు అని అడిగిన అవినాష్.. నా కొడకా ..అని తిట్టిన రాధ
Updated : Jun 11, 2024
ఈ వారం నీతోనే డాన్స్ 2 . 0 షోలో అవినాష్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. షో స్టేజి మీదకు రాగానే " నా సద్దు బేబీ కోసం వచ్చాను" అంటూ అవినాష్ కాసేపు జడ్జ్ సదాని ఏడిపించాడు. శ్రీముఖి అవినాష్ ని చూసి "ఎవరండీ మీరు" అని అడిగేసరికి "నా గురించి గూగుల్ కొట్టండి వస్తుంది" అని చెప్పాడు. "ఏమని కొట్టాలి" అని అడగడంతో "నో రిజల్ట్స్ ఫౌండ్" అని వస్తుంది అంటూ తన మీద తానే కౌంటర్ వేసుకున్నాడు. "గూగుల్ కి కూడా తెలియని ఒక సీక్రెట్ సెలెబ్రిటీని నేను నా పేరు పుచుక్, పుచుక్.. నేను ఈ షోకి రావడానికి కారణం సదా బాయ్ ఫ్రెండ్ ని..సారీ నిన్ను సదా అంటున్నాను కానీ సద్దు బేబీ అని పిలుస్తాను " అనేసరికి అందరూ నవ్వారు. "మరి మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది" అని శ్రీముఖి అడిగింది.
"ఒకరోజు ఆవిడే నన్ను అడిగారు పులుల్ని, సింహాల్ని కాపాడుతున్నాను అని చెప్పేసరికి ఫ్లాట్ ఐపోయి ఐ లవ్ యు చెప్పేసింది" అన్నాడు. అలా అన్న అవినాష్ వెంటనే సదా దగ్గరకు వెళ్లేసరికి "నన్ను యావర్ రెండు సార్లు ఎత్తుకున్నాడు. కాబట్టి యావర్ ని నువ్వు కూడా ఎత్తుకుని మోకాళ్ళ మీద కూర్చోవాలి" అని కండిషన్ పెట్టింది. దానికి అవినాష్ "పెద్ద ప్లానింగే...సద్దు ఒక్క ముద్దు " అనేసరికి "నా కోసం ఆ మాత్రం చేయలేవా.." అని అడిగింది సదా. ఇవన్నీ చేయలేని అవినాష్ వెంటనే మాట మార్చేశాడు.."రాధ మేడం ఇందాక క్యారవాన్ దగ్గర మీ అబ్బాయి కనిపించాడు" అని చెప్పాడు. " నా కొడకా నాకు" అని రాధా తిట్ల పురాణం ఎత్తుకునేసరికి దణ్ణం పెట్టేసాడు అవినాష్.