English | Telugu

Karthika Deepam2 : బలవంతంగా ప్రమాణం చేసిన కార్తిక్.. జ్యోత్స్నకి అసలు నిజం తెలిసేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -67 లో.....పారిజాతం తన బర్త్ డే సందర్బంగా ఒక కోరిక కోరుతానని అది నెరవేర్చాలని ముందే శివన్నారాయణ దగ్గర మాట తీసుకుంది. దాంతో ఏంటో ఆ కోరిక చెప్పమని శివన్నారాయణ అడుగగా...... కార్తీక్, జ్యోత్స్న లని దగ్గర కి పిలిచి.. నా కోరిక ఏంటో మీ అందరికి తెలుసు. జ్యోత్స్న పుట్టినప్పుడే దశరథ్ తన చెల్లి కాంచనకి మాట ఇచ్చాడు.‌ తన కూతురిని తన ఇంటికి కోడలుగా పంపిస్తానని పారిజాతం అనగానే.. ఇప్పటికి అదే మాట అంటున్నానని దశరత్ అంటాడు.

ఆ తర్వాత మీరు వాళ్ళకి పెళ్లి ఏం చేస్తారులే అని బంధువులు అనుకుంటున్నారు.. నాకు మీ వాలకం చూస్తుంటే వాళ్ళు అన్నదే నిజం అనిపిస్తుందని పారిజాతం అంటుంది. దాంతో శివన్నారాయణ కోపంగా నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావో సూటిగా చెప్పమని అంటాడు. నా కోరిక ఏంటి అంటే వచ్చే ముహూర్తంలో జ్యోత్స్న, కార్తీక్ కి పెళ్లి చెయ్యాలి. ఇప్పుడు జ్యోత్స్న చేతిలో కార్తిక్ చెయ్యి వేసి నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చెయ్యాలి.. ఇదే నా కోరిక అని పారిజాతం అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకని సుమిత్ర అంటుంది. అది ఇప్పుడు అవసరం.. లేదు మాట ఇచ్చాను కనుక తీర్చాలని శివన్నారాయణ అంటాడు. కార్తీక్ నువ్వు మాట ఇవ్వరా అని శివన్నారాయనా అనగానే.. కార్తీక్ షాక్ అవుతాడు. ఈ పారు ఏంటి ఇంత నమ్మకద్రోహం చేసింది. నేనేం చెప్పాను తనేం చేస్తుందని కార్తీక్ అనుకుంటాడు. ఇక నేనెప్పుడు రెడీ అంటూ జ్యోత్స్న చెయ్యి ముందు పెడుతుంది. ఇప్పుడేం చెయ్యాలని కార్తిక్ ఇబ్బందిగా ప్రమాణం చేయబోతుంటే.. శౌర్య తుమ్ముతుంది. ఇప్పుడే తుమ్మాలా అంటూ శౌర్యపై కోప్పడుతుంది పారిజాతం.

ఏం పర్లేదు చిన్నపిల్లే కదా అని శివన్నారాయణ అనగానే.. అవును కదా అని పారిజాతం బలవంతంగా కార్తీక్ చెయ్యి తీసుకొని జ్యోత్స్న చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేపిస్తుంది. ఆ తర్వాత పారిజాతం కేక్ కట్ చేస్తుంది. కార్తీక్ పైకి వెళ్తాడు. అక్కడికి జ్యోత్స్న వెళ్లి.. ఏంటి బలవంతంగా ప్రమాణం చేస్తున్నావని అడుగగా.. ఇక నిజం చెప్పాలి అని కార్తీక్ అటువైపు తిరిగి.. నువ్వంటే ఇష్టం లేదని చెప్తాడు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ జ్యోత్స్న ఉండదు. పారిజాతం ఉంటుంది. నువ్వు ఇలాంటిదేదో చేస్తావని నువ్వు మొదలు పెట్టకముందే పంపించానని పారిజాతం అంటుంది. ఎందుకు ఇలా చేసావని కార్తీక్ అడుగుతాడు.‌ వీళ్ళందరి ఆశ అదే కదా.. అయినా నువ్వు మారుతావ్ అనుకున్నాను కానీ నీ మనసులో ఇంకొకరు ఉన్నారు. ఆ ఒక్కరి కోసమే జ్యోత్స్న ని వద్దంటున్నావ్ .. దీప నీకు ముందే పరిచయం కదా ఆ విషయం ఎందుకు చెప్పలేదని పారిజాతం అడుగుతుంది. నువ్వులు తప్పుగా అపార్ధం చేసుకుంటున్నావని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.