Brahmamudi : ఆమె గురించి నిజాలు తెలుసుకొని వార్నింగ్ ఇచ్చిన రాజ్...
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -429 లో....కావ్య, అప్పు ఇద్దరు అసలు మాయ కోసం తనని వెతుక్కుంటూ వెళ్తారు. అప్పుడే మాయ ఇంటికి వస్తుంది.ఇంటి దగ్గరున్నా అప్పు, కావ్యలని చూసిన మాయ భయంతో పరుగెడుతుంది. మాయ పరుగెడుతుంటే తన వెంటే కావ్య, అప్పులు వెళ్తారు. మరొకవైపు కావ్య, అప్పులని ఫాలో అయిన రుద్రాణి.. అసలు మాయ వీళ్ళకి దొరికితే ప్రాబ్లమ్ అని మాయకు రుద్రాణి ఆక్సిడెంట్ చేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కావ్య అప్పులు తనని హాస్పిటల్ కు తీసుకొని వెళ్తారు.