English | Telugu
Karthika Deepam2 : పారు మోసం.. కొత్త హీరోయిన్ తో కథలో మలుపు!
Updated : Jun 12, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -68 లో.. నీకు చెప్పింది ఏంటి? నువ్వు చేసింది ఏమిటి? అని పారిజాతాన్ని నిలదీస్తాడు కార్తీక్. దాంతో పారిజాతం తన మనసులో ఉన్న కుట్ర మొత్తాన్ని కక్కేస్తుంది. నేను చేసింది తప్పైతే.. దీప విషయంలో నువ్వు చేసింది ఏంటి? దీప నీకు ముందే తెలుసని ఎందుకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో.. నువ్వు నీ నోటితో చెప్పకపోయినా.. నేను అర్ధం చేసుకోగలనని పారిజాతం అంటుంది. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావ్ పారూ.. ఇలాంటి లేనిపోనివి ఊహించుకుని దీపని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నావ్.. పాయసంలో మందు కలిపావ్.. ఆ రోజు బంటుగాడితో దీప బ్యాక్‌లో నెక్లెస్ పెట్టించావ్.. జోత్స్న మనసుని చెడగొడుతున్నది కూడా నువ్వేనని కార్తిక్ అంటాడు.
దాని మనసుని చెడగొట్టింది నేను కాదు నువ్వూ.. నువ్వు చేసే పనులు చూసి అది అలా తయారైంది. అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఏం జరిగినా సరే.. నా మనవడు, మనవరాలికి పెళ్లి చేయాలని అనుకున్నాను.. మీ జీవితాలను కాపాడాలని అనుకున్నానని పారిజాతం అంటుంది. ఆ పెళ్లితో మా జీవితాలను కాపాడాలనుకోవడం కాదు.. నాశనం అవుతాయని కార్తిక్ అంటాడు. హా.. ఇప్పుడు నువ్వు అదే పనిచేస్తున్నావ్ లే అని పారిజాతం అంటుంది. ఆపు పారూ.. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకోమని కార్తిక్ అంటాడు. నేనూ అదే చెప్తున్నా.. జోత్స్సని పెళ్లి చేసుకుని నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకోమని పారిజాతం అంటుంది. లేదు నేను జోత్స్నని పెళ్లి చేసుకోలేను.. నా మరదలి జీవితాన్ని అన్యాయం చేయలేనని కార్తిక్ అంటాడు. నా మనవడి జీవితం అన్యాయం అయిపోవడం నేనూ చూడలేనని పారిజాతం అంటుంది. సరే అయితే.. నీ నిర్ణయం మార్చుకోకపోతే.. నేనే అందరితో జోత్స్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తానని కార్తిక్ అంటాడు. నువ్వు ఎవర్ని మనసులో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నావో.. అందరికి అర్ధం అయ్యేట్టు నేనూ చెప్తాను.. సుమిత్ర కూతురికి కాంచన కొడుక్కి పెళ్లి జరుగుతుంది.. దీన్ని ఆ దేవుడు కూడా మార్చలేడని పారిజాతం శపథం చేసి వెళ్లిపోతుంది పారిజాతం. మరోవైపు అనసూయ.. దారిన వెళ్తూ ఓ హోటల్‌లోకి వెళ్తుంది. ఇంతకు అది దీప పనిచేసే హోటల్‌నే. ఆ విషయం తెలియని అనసూయ.. అక్కడకి వెళ్లి ఉప్మా ఆర్డర్ ఇస్తుంది. ఆ ఉప్మా టేస్ట్ చేసిన అనసూయ.. ఇదేంటి? ఈ ఉప్మా... మా దీప చేసిన దానిలా ఉందని అనుకుని కడియంని పిలిచి.. ఈ ఉప్మా ఎవరు చేశారని అడుగుతుంది. అదిగో ఆ ఉప్మా చేసిన ఆమె నీ వెనుకే ఉందని కడియం అంటాడు. వెనక్కి తిరిగే సరికి ఎదురుగా దీప ఉండటంతో.. భయపడి అక్కడ నుంచి వెళ్లిపోబోతుంది అనసూయ. తనని ఆపి.. తినేసి వెళ్లు అత్తయ్యా అని దీప ఉప్మా వడ్డిస్తుంది. మనుషుల్ని మర్చిపోయిన వాళ్ల వంటలు మాత్రం గుర్తున్నాయి.. వీటినే ప్రేమ, అభిమానం అంటారు. వాటిని మీరు వదిలేసిన నేను వదలను.. మీరు ప్రశాంతంగా ఉండి.. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండని దీప అంటుంది.
మరోవైపు పారిజాతం మోసం చేసిందని కార్తిక్ తల్చుకుంటు కార్ ని వేగంగా పోనిస్తాడు. అదే సమయంలో రోడ్డు మీద స్కూటీపై వెళ్తున్న అమ్మాయి కిందపడిపోతుంది. తనని చూసిన కార్తిక్ కార్ ని ఆపి.. ఆ అమ్మాయిని పక్కకి తీసుకొని వెళ్ళి సహాయం చేస్తాడు. ఆ అమ్మాయి స్వప్న.. కార్తిక్ ని చూసి ఇంప్రెస్ అవుతుంది. థాంక్యూ బాస్.. మీకు హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ అనుకుంటా అని స్వప్న అంటుంది. సరే జాగ్రత్తగా వెళ్లని కార్తిక్ అంటాడు. ఈ కాలితో నడవడం కష్టంగా ఉంది బాస్.. కాస్త హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయండి అని కార్తీక్ సాయం కోరుతుంది స్వప్న. ఇక ఆమె నడవడానికి ఇబ్బంది పడటంతో.. ఆమె భుజంపై చేయి వేసి మరీ నడిపిస్తుంటాడు కార్తీక్. ఇంటికి ఫోన్ చేసి మీ డాడీని హాస్పిటల్‌కి రమ్మని చెప్పమని కార్తిక్ అంటాడు. ఆ తర్వాత దీప ఫోన్ నుండి శౌర్య చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.