English | Telugu

హిమాచల్ ప్రదేశ్‌ లోని మణికరణ్ సాహిబ్ గురుద్వారాలో మంగ్లీ పుట్టినరోజు వేడుకలు


మంగ్లీ గురించి చెప్పాలంటే ఆమె ఒక అద్భుతమైన సింగర్ గా అందరికీ సుపరిచితురాలే..అటు మూవీస్ లో ఆమె పాటలు పాడుతూ ఉంటుంది. ఇటు షోస్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాంటి మంగ్లీ శివుడికి పరమ భక్తురాలు. తాను పాడే పాటల్లో శివుడి మీద పాటలే ఎక్కువగా ఉంటాయి. అలాంటి మంగ్లీ తన పుట్టినరోజు వేడుకలను ఆ శివుడి సాన్నిధ్యంలో సెలెబ్రేట్ చేసుకుంది. "ఈ రోజు నా పుట్టినరోజును హిమాచల్ ప్రదేశ్‌లోని మణికరణ్‌లో జరుపుకున్నాను.. శ్రీ మణికరణ్ సాహిబ్ గురుద్వారా యొక్క పవిత్ర క్షేత్రాన్ని సందర్శించాను.ఇక్కడ ఉడుకు నీటి ద్వారా వండే అన్నప్రసాదం సేవలో పాల్గొన్నాను.

నాపై ప్రేమ చూపించి , ఆశీర్వాదాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రేమ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మీ శుభాకాంక్షలకు మరోసారి ధన్యవాదాలు" అని పోస్ట్ చేసి తాను అక్కడ భక్తులకు అన్న ప్రసాదాన్ని పెడుతున్న వీడియోస్ ని పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే బంజారా టాప్ 1 సింగర్ మంగ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మెసేజెస్ పెడుతున్నారు. ఇంతమంది విషెస్ చెప్పినందుకు మంగ్లీ కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక మెసేజ్ ని పోస్ట్ చేసింది. తనకి శుభాకాంక్షలు చెప్పిన ఎవరినీ మరిచిపోనని కూడా చెప్పింది.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.