English | Telugu

దీపకి సర్ ప్రైజ్ ఇచ్చిన కార్తీక్.. వామ్మో పారిజాతం ప్లాన్ !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -66 లో... దీప వంక కార్తీక్ చూస్తుంటే.. అప్పుడే దీప కార్తీక్ దగ్గరికి వస్తుంది. ఏమైంది అలా చూస్తూ నవుతున్నారని దీప అడుగగా.. ఏం లేదు మిమ్మల్ని చాలా పొగడాలని ఉందని కార్తీక్ అంటాడు.‌ ఎందుకు ఏమైందని దీప అడుగుతుంది. నిన్న శౌర్యని నా దగ్గర వదిలేసి మీరు ఎక్కడికి వెళ్లారో తెలుసు.. మీ అత్తయ్య ఇందాక నిన్ను చూసి భయపడి పరిగెడుతూ నాకు డాష్ ఇచ్చింది.. ఏమైందంటే జరిగింది మొత్తం చెప్పిందని దీపతో కార్తీక్ చెప్తాడు.

ఆ తర్వాత కన్న బిడ్డ కోసం ఆ మాత్రం ఉంటుంది. అందుకే మిమ్మల్ని మెచ్చుకోవాలి అనిపిస్తుందని కార్తీక్ అంటాడు. అదంతా నా కూతురు కోసమే.. నాకు అది తప్ప ఎవరు లేరని దీప అంటుంది. అదంతా మీ వళ్లేనని కార్తీక్ అంటాడు. మీ దగ్గర ఇది లేకపోవడం వళ్లే అని ఫోన్ చూపిస్తాడు. శౌర్య స్కూల్ వదిలిపెట్టగానే మీకు ఫోన్ చేసేదని.. ఫోన్ లేకపోవడం వళ్లే ఇదంతా.. మీకోసం ఫోన్ తీసుకొని వచ్చానని కార్తిక్ అనగానే.. దీప వద్దని చెప్తుంది. నేనేం ఫ్రీగా ఇవ్వడం లేదు డబ్బులకే తీసుకోండి.. ఇదిగో స్లిప్.. మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు డబ్బాలో వేస్తున్నారు కదా.. అందులోనే ఈ డబ్బులు కూడా వెయ్యండి అని కార్తీక్ అనగానే.. దీప సరేనని తీసుకుంటుంది. అదంతా శౌర్య చూసి.. కార్తీక్ మా అమ్మకి సర్ ప్రైజ్ ఇచ్చాడు.. ఫోన్ కొన్నాడని అనుకుంటుంది. ఆ తర్వాత దీప ఫోన్ కి కార్తీక్ మిస్డ్ కాల్ ఇచ్చి.. అది నా నెంబర్ సేవ్ చేసుకోండి అని కార్తీక్ చెప్పగానే.. ఆ అవసరం రాకూడదని అనుకుంటున్నానని దీప అంటుంది.

ఆ తర్వాత పారిజాతం బర్త్ డే సెలెబ్రేషన్స్ కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ముందు దీప చేసిన పాయసం తిన్నాకే కేక్ కట్ చేస్తానని పారిజాతం అంటుంది. పాయసం తిని సుమిత్ర వాంతి చేసుకున్నట్లు.. దాంతో ఏదో కలిపావంటూ ఇంట్లో నుండి సుమిత్ర వెళ్ళమని చెప్పినట్టు పారిజాతం ఉహించుకుంటుంది. ఆ తర్వాత దీప పాయసం తీసుకొని వస్తుంది. అందరు తిని బాగుందని అంటారు. కార్తీక్ పారిజాతం దగ్గరకి వెళ్లి పాయసం ఇస్తాడు. పారిజాతం భయపడుతుంటే.. వద్దని అనగానే ఎందుకు ఎవరైనా దీంట్లో ఏదైనా కలిపారా అని కార్తీక్ అంటాడు. నేను అంత చూసాను పాయసంలో ఏదో కలిపావు.. మళ్ళీ నేను ప్రిపేర్ చేసాను.. నీ సంగతి తర్వాత చెప్తానని పారిజాతంతో కార్తిక్ అంటాడు.... ఆ తర్వాత ఏదో కోరిక కోరుకుంటా అన్నావ్ కదా ఏంటని పారిజాతాన్ని సుమిత్ర అడుగుతుంది. జ్యోత్స్న, కార్తీక్ లని పిలిచి.. నా కోరిక ఏంటో మీకు తెలుసని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.