English | Telugu

Eto Vellipoyindhi Manasu : భార్య గురించి తప్పుగా మాట్లాడారని‌‌ భర్త ఫైర్.. ఆ వ్రతం జరిగేనా!

స్టార్ మా టీవీలలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -126 లో.. వాళ్ళు అయిష్టంగానే గా పెళ్లి చేసుకున్నారని చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు వాళ్ళ బంధం బలపడిందని ధనతో సిరి చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే రామలక్ష్మి, సీతాకాంత్ లు పై నుండి వస్తుంటారు. ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్తున్నావని పెద్దాయన అడుగుతాడు. ఆఫీస్ లో చిన్న మీటింగ్ ఉందని సీతాకాంత్ అనగానే.. ఇంట్లో నీ కోసం నీ భార్య వ్రతం చేస్తుంటే ఈ టైమ్ లో ఆఫీస్ ఏంటి అర్ధం లేకుండా అని పెద్దాయన అంటాడు.

హోటల్‌ రూమ్‌లో మీడియాకి దొరికిపోయిన బ్రహ్మముడి జంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -439 లో.... కావ్య, రాజ్ లు సుభాష్ దగ్గరికి వెళ్లి అపర్ణతో మాట్లాడి తనకి బాధని తగ్గించుకోమని చెప్తారు. దాంతో బయట ఒంటరిగా కూర్చొని ఉన్న అపర్ణ దగ్గరికి సుభాష్ వచ్చి క్షమించమని రిక్వెస్ట్ చేస్తాడు.  చేసింది మాములు తప్పు కాదంటూ అపర్ణ కోప్పడుతుంది. నిన్ను ఎప్పుడు ఇన్ని రోజుల్లో బాధపెట్టానా ఏదో ఆ మాయ చేసి మాయలో పడి ఇలా జరిగింది. నాకు శిక్ష వెయ్యి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. అపర్ణ మనసు మార్చుకుంటుండగా అప్పుడే బాబు ఏడుపు వినిపించి కోపంగా వెళ్ళిపోతుంది. అదంతా కావ్య, రాజ్ లు చూస్తూనే ఉంటారు.

Karthika Deepam2 : నిన్ను పెళ్ళిచేసుకోవడం ఇష్టం లేదని చెప్పు చాలు... కారు కిందపడి చచ్చిపోతాను!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -73 లో.. దీప పనిచేసే హోటల్ కి కార్తిక్, జ్యోత్స్న లు వస్తారు. దీప చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది బావా.. నీ సీక్రెట్ నాకు చెప్పొద్దులే దీపా.. నేనే కనిపెడతానని దీపతో జ్యోత్స్న అంటుంది. దాంతో దీప.. నీకేం కావాలో చెప్పు జోత్స్న అని దీప అనగా.. మా బావ కావాలని జ్యోత్స్న అంటుంది. అదే.. దీపా.. మా బావకి ఎంతో ఇష్టమైన స్పెషల్ టీ.. నాక్కూడా ఇస్తావని వచ్చానులే.. నేను కూడా రేపటి నుంచి నీ రెగ్యులర్ కస్టమర్‌ని.. స్కూల్‌లో శౌర్యకి గార్డియన్‌గా మా బావ పేరుకి బుదులుగా నా పేరు ఇచ్చినట్టు.. నీ యోగ క్షేమాలు తెలుసుకోవడానికి మా బావకి బదులు నేనే రావాలని అనుకుంటున్నానని జ్యోత్స్న అంటుంది. ఆ పారిజాతం జోత్స్న బుర్రని పాడుచేసి పంపినట్టు ఉందని దీప అనుకుంటుంది. ఇక కార్తీక్ కూడా అదే అనుకుని జోత్స్నకి వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటాడు.

తెలుగు ఇండస్ట్రీలో ఒక పెయింటర్ నా డాన్స్ కి ఫ్యాన్ అయ్యాడు

నీతోనే డాన్స్ షో సెమి ఫినాలే పూర్తి చేసుకుని ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. సెమి ఫినాలేలో అందరూ అద్దిరిపోయే డ్యాన్సస్ చేశారు. ఐతే టాప్ ప్లేసులో ఉన్నారు అమర్ అండ్ తేజు, నయని అండ్ విశ్వా సెకండ్ ప్లేస్, భానుశ్రీ అండ్ మానస్ థర్డ్ ప్లేస్, యావర్ అండ్ వాసంతి ఫోర్త్ ప్లేస్, నితిన్ అండ్ అక్షితా ఫిఫ్త్ ప్లేస్, బ్రిట్టో అండ్ సంధ్య సిక్స్త్ ప్లేస్ లో ఉన్నారు. బాటమ్ టులో ఉన్న నితిన్ అండ్ అక్షితా, బ్రిట్టో అండ్ సంధ్య మధ్య మళ్ళీ పోటీ పెట్టింది శ్రీముఖి. చివరికి ఫైనల్స్ కి నితిన్ అండ్ అక్షితను పంపించారు. ఇక బ్రిట్టో అండ్ సంధ్య ఎలిమినేట్ అయ్యారు. ఐతే వాళ్ళు ఆ బాధను బయట పెట్టకుండా ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేశారు. తర్వాత బ్రిట్టో మాట్లాడుతూ ..

ఆట సందీప్ కి టాటూని గిఫ్ట్ గా ఇచ్చిన జ్యోతి

ఆట సందీప్ అండ్ జ్యోతి గురించి బుల్లితెర మీద అందరికీ తెలుసు. ఐతే ఆట సందీప్ బర్త్ డే సందర్భంగా జ్యోతి ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది.. ఇంతకు ఆ సర్ప్రైజ్ ఏంటి అనే విషయాన్ని సందీప్ ని గెస్ చేయమని చెప్పింది. కానీ సందీప్ మాత్రం సర్ప్రైజ్ ని ఎలా గెస్ చేస్తారంటూ ఆలోచించాడు కానీ చెప్పలేకపోయాడు. "ప్రతీ ఏడాది ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుంది కానీ ఈ ఏడాది మాత్రం ఆ సర్ప్రైజ్ వేరు..నా ఐడియాలజీ తెలుసు కదా నేనంటే కంప్లీట్  గా మా పేరెంట్స్ కన్నా ఎక్కువగా నీకే  తెలుసు కదా..సరే కళ్ళు మూసుకో" అని చెప్పి "నేను నిన్ను ఏమని పిలుస్తా" అని అడిగింది. "సనమ్" అని పిలుస్తా అని సందీప్ చెప్పాడు. దాంతో తన చేతి మీద ఉన్న ఒకదాన్ని కెమెరాకు చూపించింది.