English | Telugu
వైసీపీకి 11 సీట్లు..హాయ్ నాన్న షోలో ఆది...
Updated : Jun 12, 2024
జూన్ 16 న ఫాదర్స్ డే సందర్భంగా ఈటీవీలో నెక్స్ట్ వీక్ "హాయ్ నాన్న" అనే థీమ్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. దీని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఐతే ఇందులో రింగ్ రియాజ్ - ఆది చేసిన కామెడీ హైలైట్ గా నిలిచింది. రింగ్ రియాజ్ ముందుగా జనసేన పార్టీ కండువా వేసుకుని తర్వాత వైసీపీ కండువా వేసుకోవడంతో అతని మీద ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఈ పాయింట్ నే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైలైట్ చేసాడు ఆది. "హాయ్ నాన్న" అని ఆదిని అనేసరికి " హాయ్ రా" అన్నాడు ఆది..
రియాజ్ తన వేలు చూపిస్తూ " రింగు పోయింది" అనేసరికి "నీ వల్ల నెల్లూరే పోయింది.. రింగు పొతే ఏముంది" అని కౌంటర్ వేసాడు ఆది. "నాన్న రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది" అని రియాజ్ అనేసరికి "ఎన్ని 11 మార్కులు వచ్చినయా? అని రియాజ్ పరువు తీసేసాడు. ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే రావడంపై ఆది ఇలా కౌంటర్లు వేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. జనసేన శ్రేణులు ఈ వీడియోని బాగా షేర్ చేస్తున్నాయి. జనసేన కోసం, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో ఆది ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దాంతో జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్‌తో విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఏపీ రాజకీయం కొత్తదనాన్ని సంతరించుకుంది.