English | Telugu

ఆది..నోరు మూసుకో...హన్సికా ఘాటు వార్నింగ్



ఢీ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో ప్రతీ వారం మంచి డాన్సస్ తో స్కిట్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఈ షోలో ఆది వేసే కుళ్ళు జోకులు ఫుల్ ఫేమస్...ఈ షోకి వచ్చే జడ్జెస్ మీద కూడా జోక్స్ వేస్తూ ఉంటాడు. ఇక ఈ వారం షోకి జడ్జ్ గా వచ్చిన హన్సిక మీద అలాంటి జోక్స్ వేసాడు. దాంతో ఆమె కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చి పడేసింది. మొన్నటి వరకు ఈ ఢీ షోకి ప్రణీత సుభాష్ జడ్జిగా వ్యవహరించింది. కానీ ఇప్పుడు మాత్రం.. ఈ షోలో ప్రణీత స్థానంలో హన్సిక ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటిలాగే శేఖర్ మాష్టర్ ఉన్నారు..మరో జడ్జ్ గణేష్ మాష్టర్ కూడా కనిపిస్తున్నారు. ఈ వారం ఢీ షోకు గెస్టుగా సుధీర్ బాబు వచ్చాడు. ఆయన్ని ఆయన మూవీస్ ని లింక్ చేస్తూ శేఖర్ మాష్టర్ మీద కౌంటర్లు వేసాడు. ‘‘మీరు ఎస్ఎంఎస్ చిత్రం ఒక్కసారే చేశారు.

కానీ శేఖర్ మాస్టర్ అందరికీ ఎస్ఎంఎస్ లు చేస్తూనే ఉన్నారు ’’ అని సెటైర్ వేశారు. ‘‘మీ ప్రేమ కథా చిత్రంలో దెయ్యాన్ని చూసి మీరు పారిపోతారు కదా .. కానీ శేఖర్ మాష్టర్‌ని చూసి దెయ్యమే పారిపోతుంది’’ అంటూ మరో పంచ్ డైలాగ్ వేశాడు. దీనితో కొత్త జడ్జ్ హన్సిక శేఖర్ మాష్టర్‌కి సపోర్ట్ చేస్తూ హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చేసింది. "ఏయ్ ఆది.. శేఖర్ మాష్టర్ చాలా మంచి వాడు.. నీ నోరు మూసుకో" అంటూ ఆమె ఇచ్చిన వార్నింగ్ చాలా ఫన్నీగా ఉంది. "నాలుగో ఎపిసోడ్ కల్లా మీకు తెలిసిపోతుంది " అని హన్సికకు ఆది చెప్పేసరికి "అంటే నాలుగు ఎపిసోడ్స్ తర్వాత వెళ్ళిపోతావా నువ్వు ..అదేదో ఇప్పుడే వెళ్ళిపో " అని చెప్పింది. దానికి ఆది షాకయ్యాడు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.