English | Telugu

తెలుగు ఇండస్ట్రీలో ఒక పెయింటర్ నా డాన్స్ కి ఫ్యాన్ అయ్యాడు

నీతోనే డాన్స్ షో సెమి ఫినాలే పూర్తి చేసుకుని ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. సెమి ఫినాలేలో అందరూ అద్దిరిపోయే డ్యాన్సస్ చేశారు. ఐతే టాప్ ప్లేసులో ఉన్నారు అమర్ అండ్ తేజు, నయని అండ్ విశ్వా సెకండ్ ప్లేస్, భానుశ్రీ అండ్ మానస్ థర్డ్ ప్లేస్, యావర్ అండ్ వాసంతి ఫోర్త్ ప్లేస్, నితిన్ అండ్ అక్షితా ఫిఫ్త్ ప్లేస్, బ్రిట్టో అండ్ సంధ్య సిక్స్త్ ప్లేస్ లో ఉన్నారు. బాటమ్ టులో ఉన్న నితిన్ అండ్ అక్షితా, బ్రిట్టో అండ్ సంధ్య మధ్య మళ్ళీ పోటీ పెట్టింది శ్రీముఖి. చివరికి ఫైనల్స్ కి నితిన్ అండ్ అక్షితను పంపించారు. ఇక బ్రిట్టో అండ్ సంధ్య ఎలిమినేట్ అయ్యారు. ఐతే వాళ్ళు ఆ బాధను బయట పెట్టకుండా ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేశారు. తర్వాత బ్రిట్టో మాట్లాడుతూ ..

"ముందు నా వైఫ్ సంధ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి నీతోనే డాన్స్ కి తీసుకొచ్చి ఒక ఫ్యామిలీని పరిచయం చేసినందుకు. ఐ లవ్ యు సంధ్య.. నీతోనే డాన్స్ తో నా జర్నీ సూపర్ గా ఉంది. శ్రీముఖి ఐ లవ్ యు.. యాంకర్ గా నువ్వు నాకు ఎన్నో విషయాలు నేర్పావు" అని చెప్పాడు. బోబ్బా అనే పెయింటర్ గా పని చేసే ఒక వ్యక్తిని స్టేజి మీదకు తీసుకొచ్చి థ్యాంక్స్ చెప్పాడు. అతనికి తన రెట్రో స్టైల్ డాన్స్ నచ్చిందని చెప్పాడట ఆ విషయాన్ని బ్రిట్టో అందరితో షేర్ చేసుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఆ పెయింటర్ తనకు ఫస్ట్ ఫ్యాన్ అని కూడా చెప్పి ఎంతో సంతోషపడ్డాడు. అలా నెక్స్ట్ వీక్ కి మిగతా టీమ్స్ అన్ని వెళ్ళబోతున్నాయి. ఇక జడ్జెస్ ఐతే ఫైనల్స్ లో ఎంటర్టైన్మెంట్ కావాల్సిందే అని చెప్పారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.