English | Telugu
హోటల్ రూమ్‌లో మీడియాకి దొరికిపోయిన బ్రహ్మముడి జంట!
Updated : Jun 18, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -439 లో.... కావ్య, రాజ్ లు సుభాష్ దగ్గరికి వెళ్లి అపర్ణతో మాట్లాడి తనకి బాధని తగ్గించుకోమని చెప్తారు. దాంతో బయట ఒంటరిగా కూర్చొని ఉన్న అపర్ణ దగ్గరికి సుభాష్ వచ్చి క్షమించమని రిక్వెస్ట్ చేస్తాడు. చేసింది మాములు తప్పు కాదంటూ అపర్ణ కోప్పడుతుంది. నిన్ను ఎప్పుడు ఇన్ని రోజుల్లో బాధపెట్టానా ఏదో ఆ మాయ చేసి మాయలో పడి ఇలా జరిగింది. నాకు శిక్ష వెయ్యి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. అపర్ణ మనసు మార్చుకుంటుండగా అప్పుడే బాబు ఏడుపు వినిపించి కోపంగా వెళ్ళిపోతుంది. అదంతా కావ్య, రాజ్ లు చూస్తూనే ఉంటారు.
ఆ తర్వాత మరుసటి రోజు కావ్య దగ్గరికి అప్పు వస్తుంది. ఇంత ప్రొద్దునే ఎందుకు వచ్చావని కావ్య అడుగుతుంది. కావ్యని పక్కకి తీసుకొని వెళ్లి అసలు మాయ స్పృహలోకి వచ్చిందని చెప్పగానే.. కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ మాటలు కళ్యాణ్ విని.. మీరు నన్ను పరాయి వాడిని చేశారు. ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదు. నేను మీతో వస్తానని కళ్యాణ్ అనగానే.. సరే అని అప్పు, కావ్య, కళ్యాణ్ లు హాస్పిటల్ కి వెళ్తారు. మాయ స్పృహ లోకి వచ్చిన విషయం తెలుసుకున్న రుద్రాణి.. ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోతుందని రాహుల్ కి చెప్పి రౌడీలని హాస్పిటల్ కి వెళ్ళమని చెప్తుంది. ఆ తర్వాత మాయ దగ్గరికి ఇద్దరు రౌడీలు వచ్చి మిమ్మల్ని డిశ్చార్జ్ చేశారని మాయ తో అనగానే మీరెవరని మాయ అడుగుతుంది. కావ్య పంపించిందని చెప్పాగానే నేను ఒకసారి కావ్యతో మాట్లాడాలని మాయ అనగానే.. కావ్య మేడమ్ ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు.. మీరు వెళ్ళేది అక్కడికే కదా అని మాయని నమ్మించి హాస్పిటల్ నుండి రౌడీలు తీసుకొని వెళ్తుంటారు.
ఆ తర్వాత కావ్య వచ్చేసరికి హాస్పిటల్ లో మాయ ఉండదు. ఏమైందని డాక్టర్ ని అడుగగా.. మీరే డిశ్చార్జ్ చెయ్యమన్నారని తీసుకెళ్లారు అనగానే కావ్య వాళ్ళు బయటకు వచ్చి చూసేసరికి కార్లు వెళ్తుంటాయి. వెంటనే కార్లని కావ్య వాళ్ళు ఫాలో అవుతుంటారు. మరొకవైపు అపర్ణ దగ్గరకి రాజ్ వచ్చి మాట్లాడతాడు. తరువాయి భాగంలో రౌడీలు ఏదో హోటల్ కి వెళ్తారు. రిసెప్షన్ లో రూమ్ నెంబర్ అడిగి అప్పు, కావ్య, కళ్యాణ్ లు వెతుకుతుంటారు. అప్పు, కళ్యాణ్ లు గదిలో ఉండగా బయటనుండి ఎవరో లాక్ వేస్తారు. అప్పుడే మీడియా వచ్చి.. హోటల్ లో కళ్యాణ్ అప్పులు అడ్డంగా దొరికిపోయారని న్యూస్ లో వస్తుంటే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.