English | Telugu
Guppedantha Manasu : రంగా కాదు రిషి.. ఎవరూ ఊహించని ట్విస్ట్!
Updated : Jun 18, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1104 లో.....వసుధార వెళ్ళిపోయిందని మహేంద్ర బాధపడుతుంటే.. అనవసరంగా రిషి టాపిక్ తీసి వసుధారని బాధపెట్టానని ఫణీంద్ర ఫీల్ అవుతాడు. తను వెళ్ళింది గానీ నెక్స్ట్ ఎండీ ఎవరనేది చెప్పకుండానే వెళ్ళిందని శైలేంద్ర అంటాడు. లెటర్ పై వారి నేమ్ రాసినా బాగుండేది అనగానే.. లెటర్ ఏంటని మను అంటాడు. దాంతో శైలేంద్ర కంగారుపడుతు ఏం లేదని అంటాడు.
ఆ తర్వాత ఎండీ బాధ్యతలు మన కుటుంబంలో ఒకరికి మాత్రమే కదా.. అయిన మను మన కుటుంబం కాదు కదా అని శైలేంద్ర అంటాడు. ఇంకెవరు నేను మాత్రమే ఎండీ బాధ్యతలు చెప్పట్టాలని శైలేంద్ర అనగానే.. నువ్వు ఎలా డిసైడ్ చేస్తావ్ బోర్డు మీటింగ్ జరగాలి.. మినిస్టర్ గారు రావాలని మహేంద్ర అంటాడు. మరొకవైపు వసుధార స్పృహలోకి వచ్చి రిషి అంటూ కలవరిస్తుంది. అప్పుడే రంగా వాళ్ళ నాయనమ్మ వచ్చి టాబ్లెట్ ఇస్తుంది. నా మనవడిని కాపాడావని ఆమె అనగానే.. నా రిషి సర్ ఎక్కడ అని వసుధార అడుగుతుంది. రిషి సర్ ఎవరు లేరు నువ్వు పడుకోమని తను చెప్తుంది. మరొకవైపు శైలేంద్ర తనని తాను తిట్టుకుంటు ఉంటాడు. ఆ వసుధార నా పేరు చెప్పిన బాగుండేది అనవసరంగా చంపించేశానని రౌడీకి ఫోన్ చేసి నిజంగానే వసుధారని చంపావా అని అడుగుతాడు. చంపించేసానని అతను చెప్తాడు. ఎక్కడ పాతి పెట్టారో లొకేషన్ పెట్టని శైలేంద్ర అనగానే.. సరేనని రౌడీ అంటాడు. అదేంటి ఇప్పుడు వాడు వస్తే ఎలా మనం చంపలేదు కదా అని ఇంకొక రౌడీ అంటాడు. ఆ లోపు ఆ వసుధారని వెతికి చంపేయాలని రౌడీ అంటాడు.
మరొకవైపు రిషి సర్ అంటూ హాల్లో ఉన్న రంగా దగ్గరకి వసుధార వస్తుంది. అసలు నువ్వు ఎవరు నా బావ రంగాని పట్టుకొని రిషి సర్ అంటున్నావని సరోజ కోప్పడుతుంది. లేదు తను నా భర్త రిషి.. తన కోసం వెతుకుంటూ వస్తుంటే ఇలా జరిగిందని వసుధార అంటుంది. బావ.. నువ్వు రిషి సర్ కాదు నా బావ రంగా అని చెప్పు అని సరోజ అంటుంది. ఆ తర్వాత రంగా కాసేపు అలోచించి, నేనే తన రిషి సర్ ని.. నీ బావ కాదు. మీ మనవడిని కాదు నాయనమ్మ అని రిషి అనగానే.. అందరు షాక్ అవుతారు. వసుధార మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రిషిని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.