English | Telugu

శౌర్యకి గార్డియన్ గా కార్తీక్.. నేనుంటానంటూ జ్యోత్స్న ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -72 లో..... జ్యోత్స్న కి కార్తీక్ ఫోన్ చేసి బ్రేక్ ఫాస్ట్ కి రమ్మని చెప్పడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ ఛాన్స్ వదులుకోకూడదు.. కొన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడాలని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు శౌర్యని దీప తీసుకొని స్కూల్ కి వెళ్తుంది. అక్కడ ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ కదా.. నువ్వు మీ అమ్మని మాత్రమే తీసుకొని వచ్చావ్.. మీ నాన్న ఎక్కడ అని శౌర్య ఫ్రెండ్ అడుగగా.. మా నాన్న ఊరు వెళ్ళాడని శౌర్య చెప్తుంది.

ఆ తర్వాత కార్తీక్ కి శౌర్య ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావంటు వెంటనే దీప ఫోన్ కట్ చేస్తుంది. ఎందుకు ఫోన్ చేసావని దీప అడుగగా.. నువ్వు వస్తే స్కూల్ లో జాయిన్ చేసుకోలేదు. ఇప్పుడు నువ్వు వస్తే మళ్ళీ నన్ను బయటకు పంపిస్తే ఎలా అని శౌర్య అంటుంది. ఆ తర్వాత కార్తీక్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. శౌర్య లిఫ్ట్ చేసి కార్తీక్ నువ్వు త్వరగా రా అని చెప్పగానే.. ఏమైందో ఏంటో అని కార్తీక్ స్కూల్ దగ్గరికి వెళ్తాడు. నాకు భయంగా ఉంది కార్తీక్ ఇక్కడే ఉండు ప్లీజ్ అని శౌర్య రిక్వెస్ట్ చెయ్యడంతో.. సరే కాసేపు ఉండి వెళ్తానని కార్తీక్ అంటాడు. ముగ్గురు కలిసి లోపలికి వెళ్తుంటే జ్యోత్స్న ఫ్రెండ్.. వాళ్ళని ఫోటో తీస్తుంది. మరొకవైపు బావ బ్రేక్ ఫాస్ట్ కి పిలిచాడని జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతు.. సుమిత్రకి చెప్తుంది. హ్యాపీగా వెళ్లిరా అని సుమిత్ర చెప్తుంది. ఆ తర్వాత జ్యోత్స్నకి తన ఫ్రెండ్ ఫోటో పంపిస్తుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే జ్యోత్స్న కోపంగా స్కూల్ కి బయల్దేర్తుంది.

ఆ తర్వాత పేరెంట్స్ మీటింగ్ లో ఉన్న కార్తీక్, దీపల దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది. తనని చూసి వాళ్ళు షాక్ అవుతారు. శౌర్య గార్డియన్ గా మా బావ ఉన్నాడు. ఇక నుండి నేను ఉంటాను. తను చాలా బిజీ మీరు అలా వెయిట్ చేయిస్తే ఎలా అని ప్రిన్సిపల్ తో జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత దీప హోటల్ కి వెళ్ళిపోతుంది. మరొకవైపు కోపంగా కార్తీక్ కి చివాట్లు పెడుతుంది జ్యోత్స్న. ఆ తర్వాత దీప హోటల్ కి కార్తీక్ ని తీసుకొని వెళ్తుంది జ్యోత్స్న. అక్కడ దీపని ఇండైరెక్ట్ గా అవమానిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.