English | Telugu
'కార్తీక దీపం 2' డొల్ల.. మోనిత లేని కార్తీక దీపం సీరియల్ మాకొద్దు!
Updated : Jun 16, 2024
కార్తీక దీపం ఫస్ట్ పార్ట్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇందులో కార్తీక్, దీప అండ్ మోనిత.. ఈ ముగ్గురు మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ ఆడియన్స్ ని కట్టిపడేసింది. హీరో - హీరోయిన్ ఉన్నప్పుడు తప్పనిసరిగా విలన్ లేకపోతే ఆ సీరియల్ కానీ సినిమా కానీ రేటింగ్ రాదు సక్సెస్ ఉండదు, బోరింగ్ గా సప్పగా ఉంటుంది. ఎక్కువ కాలం ఆడియన్స్ ని మెప్పించలేదు.. ఇప్పుడు కార్తీక దీపం పార్ట్ 2 అలాగే ఉంది. ఆ సీరియల్ లో ఫైర్ లేదు...ఆడియన్స్ లో అంత ఊపు కూడా లేదు. వీక్లీ రేటింగ్స్ లో కూడా ఎక్కడా ప్లేస్ లేదు.
ఇప్పుడు శోభాశెట్టి ఫాన్స్ ఈ విషయాన్ని చెప్తూ కార్తీక దీపం ప్రోమో కటింగ్ ని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. "ట్యాగ్ మోనిత ఫాన్స్..కార్తీక సీరియల్ లో ఏమీ లేదు అంతా డొల్ల" అని సీరియల్ పార్ట్ 1 ని ఫాహద్ ఫాజిల్ ఇంటరెస్టింగ్ గా చూస్తున్నట్టు...అదే ఫాహద్ ఫాజిల్ పార్ట్ 2 చూసి డల్ గా ఉన్న ఫేసెస్ ని పోస్ట్ చేశారు. కింద ఇంకో పిక్ లో బ్రహ్మానందం చెప్పినట్టు ఒక డైలాగ్ ని పోస్ట్ చేశారు. "భల్లాల దేవుడు లేని బాహుబలి ఎలా ఉంటదో...మోనిత లేని కార్తీక దీపం కూడా అలాగే ఉంటది" అని చెప్పారు.
నిజమే కదా గట్టి విలన్ లేకపోతే సీరియల్ ఎందుకు అని ఆడియన్స్ కూడా అంటున్నారు. మరి ఈ సీరియల్ మేకర్స్ మోనిత ఫాన్స్ చెప్పిన పాయింట్ ని ద్రుష్టిలో పెట్టుకుని ఇకనైనా సీరియల్ లోకి మోనిత అలియాస్ శోభా శెట్టిని తీసుకొస్తే సీరియల్ ఓ రేంజ్ లో పేలే అవకాశం కనిపిస్తోందంటున్నారు సినీ క్రిటిక్స్.