English | Telugu

Eto Vellipoyindhi Manasu : భార్య గురించి తప్పుగా మాట్లాడారని‌‌ భర్త ఫైర్.. ఆ వ్రతం జరిగేనా!

స్టార్ మా టీవీలలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -126 లో.. వాళ్ళు అయిష్టంగానే గా పెళ్లి చేసుకున్నారని చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు వాళ్ళ బంధం బలపడిందని ధనతో సిరి చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే రామలక్ష్మి, సీతాకాంత్ లు పై నుండి వస్తుంటారు. ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్తున్నావని పెద్దాయన అడుగుతాడు. ఆఫీస్ లో చిన్న మీటింగ్ ఉందని సీతాకాంత్ అనగానే.. ఇంట్లో నీ కోసం నీ భార్య వ్రతం చేస్తుంటే ఈ టైమ్ లో ఆఫీస్ ఏంటి అర్ధం లేకుండా అని పెద్దాయన అంటాడు.

ఆఫీస్ లో వర్క్ అంటున్నారు కదా వెళ్లనివ్వండి పూజ వరకు వస్తే చాలని రామలక్ష్మి అనగానే.. థాంక్స్ అర్ధం చేసుకున్నందుకు అని సీతాకాంత్ అంటాడు. నేను హర్ట్ అయ్యాను.. ఎందుకు ఇలా థాంక్స్ చెప్తున్నారని రామలక్ష్మి అంటుంది. మీరు వెళ్ళేటప్పుడు దేవుడికి మొక్కుకొని వెళ్ళండి అని రామలక్ష్మి చెప్పగానే.. సీతాకాంత్ మొక్కుకొని బయలుదేర్తాడు. నేను పూజ చేసుకుంటున్న మీరు తప్పకుండా రావాలని శ్రీవల్లి, సిరిలకి చెప్తుంది రామలక్ష్మి.ఆ తర్వాత రామలక్ష్మి చుట్టూ పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్లి వ్రతానికి రమ్మని చెప్తుంది. ఎలాగైనా రామలక్ష్మి పరువు తీయాలని శ్రీవల్లి అనుకొని వ్రతం కోసం వస్తున్న కొంతమంది స్త్రీలు వస్తుంటే కావాలనే..‌ అభి రామలక్ష్మి ఉన్న ఫొటోస్ తో ఎదరుపడుతుంది. ఆ ఫోటో లో ఉన్నా అబ్బాయి ఎవరని వాళ్ళు అడుగగా రామలక్ష్మి బాయ్ ఫ్రెండ్ అంటు, రామలక్ష్మి గురించి శ్రీవల్లి నెగెటివ్ గా చెప్తుంది. అలాంటిది వ్రతం చేస్తుంటే మనం ఎందుకు ఉండాలంటూ వాళ్ళంతా తిరిగి వెనక్కి వెళ్లిపోతుంటారు.

అప్పుడే రామలక్ష్మి చూసి అయ్యో ఎందుకు వెళ్తున్నారని అడుగుతాడు. రామలక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుతుంటే.. అప్పుడే సీతాకాంత్ వచ్చి నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు. మీరు నా భార్యని ఆశీర్వదించే అర్హత కోల్పోయారు ఇక్కడ నుండి వెళ్లిపోండి అని పంపిస్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ రెడీ అయి వస్తానంటూ వెళ్తాడు. పూజకి అంతా సిద్ధం చేసి పంతులు రామలక్ష్మితో పాటు వ్రతానికి పిలిచినా వాళ్ళు కూడా వచ్చి కూర్చోండి అని చెప్పగానే రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. ఏమైందని పెద్దాయన అనగానే వాళ్ళు వచ్చేలా లేరని రామలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.