Brahmamudi : అన్నకి శోభనం.. తన భార్యకి విడాకులిస్తానన్న తమ్ముడు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -447 లో.....రాజ్, కావ్యలు వాళ్ళ రూమ్ కి వెళ్లేసరికి ఇందిరాదేవి, సీతారామయ్య వాళ్ళుంటారు. మీరేంటి మా గదిలో ఉన్నారని రాజ్ అడుగుతాడు. ఈ రోజు మేమ్ ఇక్కడే పడుకుంటాం.. మీరు మా గదిలో పడుకోండి అని ఇందిరాదేవి అంటుంది. ఈ రోజేంటి ఇంట్లో అందరు వింతగా ప్రవర్తిస్తున్నారని రాజ్, కావ్య ఇద్దరు అనుకుంటారు. ప్లాన్ సక్సెస్ అయిందంటూ ఇందిరాదేవి, అపర్ణ, స్వప్న, ప్రకాష్ సుభాష్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను వెలిగించిన అగ్గిపుల్ల ఇంక చిచ్చు పెట్టలేదు ఏంటని రుద్రాణి అనుకుంటుంది.