English | Telugu
Karthika Deepam2 : నిన్ను పెళ్ళిచేసుకోవడం ఇష్టం లేదని చెప్పు చాలు... కారు కిందపడి చచ్చిపోతాను!
Updated : Jun 18, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -73 లో.. దీప పనిచేసే హోటల్ కి కార్తిక్, జ్యోత్స్న లు వస్తారు. దీప చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది బావా.. నీ సీక్రెట్ నాకు చెప్పొద్దులే దీపా.. నేనే కనిపెడతానని దీపతో జ్యోత్స్న అంటుంది. దాంతో దీప.. నీకేం కావాలో చెప్పు జోత్స్న అని దీప అనగా.. మా బావ కావాలని జ్యోత్స్న అంటుంది. అదే.. దీపా.. మా బావకి ఎంతో ఇష్టమైన స్పెషల్ టీ.. నాక్కూడా ఇస్తావని వచ్చానులే.. నేను కూడా రేపటి నుంచి నీ రెగ్యులర్ కస్టమర్‌ని.. స్కూల్‌లో శౌర్యకి గార్డియన్‌గా మా బావ పేరుకి బుదులుగా నా పేరు ఇచ్చినట్టు.. నీ యోగ క్షేమాలు తెలుసుకోవడానికి మా బావకి బదులు నేనే రావాలని అనుకుంటున్నానని జ్యోత్స్న అంటుంది. ఆ పారిజాతం జోత్స్న బుర్రని పాడుచేసి పంపినట్టు ఉందని దీప అనుకుంటుంది. ఇక కార్తీక్ కూడా అదే అనుకుని జోత్స్నకి వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటాడు.
ఏంటి దీప.. ఏం మాట్లాడవని జోత్స్న అంటే.. నా యోగక్షేమాల కోసం ఎవరు రావాల్సిన పనిలేదని దీప అంటుంది. అంతేలే నేను వస్తానంటే వద్దంటావ్.. మా బావ వస్తానంటే రమ్మంటావని జ్యోత్స్న కోపంగా చూస్తుంది. దాంతో దీప.. నా జీవితం ఎవరో ఎగరేసిన గాలిపటం కాదు.. నా చేతులతో నేను ఎగరేసుకున్నది.. ఎదురుగాలికి ఎగరడమే కానీ.. భయపడే మనిషిని కాదని అని అంటుంది. మనకెందుకులే అని వదిలేయడానికి మనది మామూలు బంధం కాదు దీపా.. ఏంటి బావా?? మా బంధం ఏంటో నువ్వే చెప్పాలని అంటుంది. ఏంటి జోత్స్న నేనేం చెప్పాలని అంటాడు. అదే బావా.. మా ఇద్దర్నీ కలిపింది మా మమ్మీనే కదా.. అలా దీప.. నా ఆత్మ బంధువు అయ్యింది.. కాబట్టి నీ యోగక్షేమాలు తెల్సుకోవడం నా బాధ్యత కదా అని జ్యోత్స్న అంటుంది. ఇంతలో కడియం రావడంతో.. ఇందాక నేనెవరని అడిగావ్ కదా.. నేను కార్తీక్ బాబూ మరదల్ని కాదు.. మీ కార్తీక్ బాబు భార్యని అని జ్యోత్స్న అంటుంది. అవును నేను కార్తీక్‌కి కాబోయే భార్యని.. జోత్స్న అంటే కార్తీక్ భార్య అని గుర్తు పెట్టుకో. చివరిగా నీకో మాట చెప్తున్నా దీప.. పేరెంట్స్ మీటింగ్ బాగా జరిగినట్టు ఉంది.. ఇకపై నీ గురించి ఏది జరిగినా నాకు తెలుస్తుంది.. పద బావా అని కార్తీక్‌ని తీసుకుని వెళ్లిపోతుంది. ఆ పాప కార్తీక్ బాబు గారికి కాబోయే భార్యా?? ఆమె మాటలు చాలా తేడాగా ఉన్నాయమ్మా అని కడియం అంటాడు. అవన్నీ మనకెందుకు బాబాయ్.. వెళ్లి పనిచూసుకోమని దీప అంటుంది. జోత్స్నకి ఇప్పుడు పారిజాతం గారి మాటలు తప్ప, నా మాటలు ఎక్కవు. ఈ అనుమానాలు తీరిపోవాలంటే కార్తీక్ బాబుకి జోత్స్నకి పెళ్లి కావాలి.. కార్తీక్‌ని మాట్లాడమని చెప్పాను.. జోత్స్నతో మాట్లాడలేదని అనుకుంటా అని దీప అంటుంది. మరోవైపు శ్రీధర్.. రెండో భార్య కూతురు స్వప్నని ముద్దు చేస్తుంటాడు. ఈ డాడీపై అలక ఎందుకు చిట్టి తల్లీ అని కూతుర్ని కాకాపడుతుంటాడు. మీరిద్దరూ మాట్లాడకపోతే నేనెందుకు ఉంటాను వెళ్లిపోతానని శ్రీధర్ అనగా.. వెళ్లండి, వెళ్లండి.. వైజాగ్‌లో ఉంటే ఎలాగూ వచ్చేవారు కాదు.. మీ కోసం నేను హైదరాబాద్ వస్తే కనీసం మాతో రెండు రోజులు ఉండలేకపోతున్నారు.. పోతే పోండి.. మళ్లీ రావద్దు.. మీకు ఈ కూతురంటే ఇష్టమే లేదని స్వప్న అంటుంది. ఇక శ్రీధర్ తనని బ్రతిమిలాడతాడు కాసేపటికి తనకి పని ఉందని వెళ్లిపోతాడు. ఇక స్వప్న అయితే.. డాడీ ఇలాగే మాట్లాడతారు కానీ.. ఏదో రోజు.. బాస్‌ని తీసుకొచ్చి డాడీకి పరిచయం చేస్తా.. బాస్‌ని చూడగానే డాడీ థ్రిల్ అయిపోతార ని స్వప్న అంటుంది. సరే.. డైరెక్ట్‌గా మీ బాస్‌ని ఇంటికే పిలువమని స్వప్న తల్లి కావేరి అంటుంది. కార్తిక్ , జ్యోత్స్న లు కారులో వెళ్తుంటారు. రెస్టారెంట్‌కి వెళ్దామని చెప్పి దీపతో స్కూల్‌కి ఎందుకు వెళ్లావని జ్యోత్స్న అడుగుతుంది. శౌర్యకి భయంగా ఉందంటే వెళ్లానంటు కార్తిక్ చెప్తాడు. సరే మనకి పెళ్లి అయ్యి హనీమూన్‌కి వెళ్తాం.. అప్పుడు శౌర్య కాల్ చేసి.. భయంగా ఉందంటే.. వెళ్లిపోతావా? అని జ్యోత్స్న అడుగగా.. అది వేరూ ఇది వేరూ అని కార్తిక్ అంటాడు.
వాళ్లందరి గురించి కాదు జోత్స్నా.. నువ్వేం అనుకుంటున్నావో చెప్పు.. నీకూ మనసు ఉంది కదా.. దాంతో ఆలోచించి నువ్వేం అనుకుంటున్నావో చెప్పమని కార్తిక్ అంటాడు. దాంతో జోత్స్న.. ఐ లవ్యూ బావా.. మనసుతో ఆలోచిస్తే నీపై నాకు ఉన్న ఫీలింగ్ ఇదే.. అక్కడ నువ్వు తప్ప వేరే ఆలోచనకి చోటు లేదు. చివరికి నాక్కూడా చోటు లేదు.. నాది ప్రేమ కాదు.. అంతకంటే ఎక్కువ అని జ్యోత్స్న అనగా.. కార్తిక్ మౌనంగా ఉంటాడు. నా ప్రేమకి నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టినా పర్లేదు.. నేను గెలుస్తాననే నమ్మకం ఉంది బావా? నా ప్రేమని నీకు లైవ్‌లో చూపించాలంటే.. నువ్వేం చేయాల్సిన పనిలేదు.. జోత్స్న నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పు చాలు.. వెంటనే కారు కింద పడి చచ్చిపోతాను.. ట్రై చేస్తావా బావా అంటూ కారులో పడటానికి వెళ్లిపోబోతుంది జోత్స్న. కార్తీక్ అడ్డుకుని.. జీవితం అంటే ఆటలుగా ఉందా అని అంటాడు. నా లైఫే నువ్వని అనుకున్నప్పుడు.. అందులో నువ్వే ఉండను అన్నప్పుడు ఆ లైఫ్ నా కొద్దు.. నువ్వు శౌర్య వల్ల దీపపై జాలి చూపిస్తున్నావా? లేదంటే దీప వల్ల శౌర్యపై జాలి చూపిస్తున్నావా? అని అడుగుతుంది. నేను శౌర్య గురించే చేస్తున్నా.. దీప దగ్గరకు వెళ్లేది కూడా శౌర్య గురించే అని కార్తిక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.