English | Telugu

వాళ్ళ నాన్న చావుకి కార్తీక్ కారణం కాదని తెలుసుకున్న దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -78 లో.. దీప దగ్గరకు వెళ్లిన నర్సింహ.. శౌర్యని తనకి ఇచ్చేస్తే జీవితంలో తన ముఖం చూపించని అంటాడు. నీకు నచ్చినట్టు బతకొచ్చు.. నీ గురించి తప్పుగా మాట్లాడను.. ఇందులో బలవంతం ఏం లేదు.. నిజంగా పాప నాకే పడితే నాకు ఇచ్చేయ్.. నాకు పుట్టలేదంటావా? నీ దగ్గరే పెట్టుకో. నాకు వద్దు.. కానీ ఏదొక సమాధానం మాత్రం చెప్పు.. నువ్వు ఇంటికి వెళ్లి ప్రశాంతంగా ఆలోచించి నీ సమాధానం ఏంటో చెప్పు? నువ్వేంటో నువ్వే చెప్పుకున్నట్టవుతుంది.. ఆలోచించి నిర్ణయం తీసుకో.. ఇక మన మధ్య కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఉండకూడదు.

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి నిజస్వరూపాన్ని త్వరలోనే బయటపెడతా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -129 లో....తన తల్లి పై నిందలు ఇంకోసారి వేసి తనని నన్ను బాధపెట్టకని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత మా అమ్మ సీత అన్నయ్య సవతి తల్లి అయిన కూడా మాకంటే ఎక్కువగా అన్నయ్యనే ప్రేమగా చూసుకుంటుంది. నువ్వు అమ్మని అవమానించినందుకు నాకు బాధగా ఉంది వదిన అని సిరి అంటుంది. నువ్వు ఎక్కడో పొరపాటు పడ్డావ్ మారొక్కసారి ఇలాంటివి రీపీట్ అవ్వనివ్వకని పెద్దాయన అంటాడు.  నువ్వు మా అమ్మని అవమానిస్తావా తల్లీ కొడుకులని దూరం చెయ్యాలని అనుకుంటున్నావా అని సందీప్ అంటాడు. దేవత లాంటి అత్తయ్య ని అపార్థం చేసుకుంటావా అని శ్రీవల్లి అంటుంది. నిజానిజాలు తెలుసుకోకుండా బావకి కోపం తెప్పించే పనులు చెయ్యకని ధన అంటాడు. ఇలా అందరు రామలక్ష్మిది తప్పన్నట్లు మాట్లాడతారు.

Brahmamudi : టెన్షన్ లో చిన్న కోడలు.. వాళ్ళిద్దరు కలిసి ఆమె జాడని కనిపెడతారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -442 లో....అపర్ణ తన గదిలోకి వెళ్లి బాధపడుతుంటే అప్పుడే సుభాష్ వస్తాడు. తనేదో చిన్నపిల్ల తన మాటలు పట్టించుకొని బాధపడకని సుభాష్ అనగానే మరి మీరు చేసిన పనికి బాధపడకుండా ఎలా ఉంటారు. కళ్యాణ్ వాడు నా చేతుల్లో పెరిగాడు తప్పు చేసే మనిషి కాదు. ఆ ధాన్యలక్ష్మి నా ముందు మాట్లాడాలంటేనే భయపడుతుంది కానీ తన కోడలితో కలిసి అసలు ఎలా మాట్లాడుతుంది. దానికి కారణం మీరే కదా. అప్పుడు నేనేం మాట్లాడినా నీ భర్త గురించి చూసుకొని.. ఇక్కడ మాట్లాడాలి అంటారు. నా మొహం ఎక్కడ పెట్టుకోవాలని అపర్ణ అంటుంది.

Karthika Deepam2 : నాన్న కావాలని ఎమోషనల్ అయిన శౌర్య.. కూతురిని పట్టుకొని ఏడ్చేసిన దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -76 లో....కార్తీక్ దీప దగ్గరికి వచ్చి.. నిన్ను నర్సింహా మళ్ళీ ఏమైనా అన్నాడా.. నువ్వు వాడి మీద కంప్లైంట్ ఇచ్చావా అని అడుగుతాడు. వాడు నన్ను ఏమైనా అంటే మీకేంటి ? నా గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు. నేనేం అంటున్నా మీరేం అంటున్నారని కార్తీక్ సీరియస్ అవుతాడు. వాడు శౌర్యని అడ్డుపెట్టుకొని నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నాడు. అది అర్థం కాదా మీరేం చెయ్యరు నన్నేం చెయ్యనివ్వరని కార్తీక్ అంటాడు. మీరు జ్యోత్స్నతో మాట్లాడలేదని దీప అనగానే.. జ్యోత్స్న మిమ్మల్ని ఏమైనా అందా అని కార్తీక్ అడుగుతాడు. మీరు అనేలా ఎందుకు చేస్తున్నారని దీప అంటుంది. ఇది నా జీవితం నన్ను బ్రతనివ్వండని దీప చేప్పి వెళ్ళిపోతుంది.