English | Telugu
విష్ణు ప్రియ ఓల్డ్ పీస్.. తక్కువకే వస్తుంది!
Updated : Jul 30, 2024
తెలుగు టీవీ షోలలో, ఇన్ స్టాగ్రామ్ లో మెరిసే తారలు కాస్త భిన్నంగా ఉంటారు. వీరికి ఒక్కో షోకి ఇంత పేమెంట్ అంటు ఈవెంట్ ఆర్గనైజైర్స్ ఇస్తుంటారు. అలా శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్, సుమ షో, అలీ షో , రీతు చౌదరి ' దావత్ ' షో ప్రస్తుతం ట్రెండింగ్ లో నడుస్తున్నాయి.
తాజాగా స్టార్ మా టీవీలో మొదలైన మరో షో కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్. ఇందులో రెండు టీమ్ లు ఉన్నాయి. ఒకటి అనసూయ టీమ్, మరోకటి శేఖర్ మాస్టర్ టీమ్. ఈ రెండు టీమ్ ల మధ్య కొన్ని టాస్క్ లు ఉంటాయి. వారిలో ఎవరు ఎక్కువగా ఆడి గెలుస్తారో వారే విజేత. అయితే ఇందులోకి తాజాగా రీతూ చౌదరి, విష్ణు ప్రియ వచ్చారు. సాధారణంగా వీరిద్దరు కలిసి ట్రిప్స్ కి వెళ్తుంటారు. ఒకానొక సందర్భంలో తన బాయ్ ఫ్రెండ్ విష్ణు ప్రియ అని రీతు చౌదరి చెప్పుకొచ్చింది. ఇక వీరిద్దరు కలసి తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో విష్ణు ప్రియ కొన్ని బోల్డ్ సమాధానాలిచ్చింది.
కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోకి ఇద్దరిని కలిపి ఒకసారే జంట ప్యాకేజీ కింద తీసుకున్నారా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకి ఇద్దరు కాస్త బోల్డ్ ఆన్సర్ ఇచ్చారు. ప్యాకేజ్ ఏం లేదు సపరేట్ సపరేట్ పేమెంట్సే.. మమ్మల్ని ఇద్దరిని విడివిడిగానే అప్రోచ్ అయ్యారని రీతూ చెప్పింది. విష్ణుప్రియ మాత్రం సూటిగా సుత్తి లేకుండా తన మనసులోని మాటను చెప్పింది. మా రీతూ గారు ఒక టాక్ షో వల్ల బాగా ఫేమస్ అయి ఇన్‌స్టా రీల్స్‌లో ఇలా ఎక్కడ చూసినా ట్రెండింగ్ తనే ఉందని ఈ గొప్ప పీస్‌ను ఎంచుకోవడం జరిగింది. నేను ఓ తుప్పు పట్టిపోయిన పీస్.. ఈమె చాలా రోజులు అయింది తుప్పుపట్టి.. మనం తక్కువలో పిలిస్తే వస్తదేమోనని నన్ను పిలిచారు.. నేను కూడా బాలి వెళ్లడం జరిగింది.. సర్లే పేమెంట్‌కి హెల్ప్ అవుతుందని వెళ్ళడం జరిగిందంటూ విష్ణుప్రియ బోల్డ్ రిప్లై ఇచ్చింది.