English | Telugu
ఎప్పటికి మారతార్రా మీరంతా ?
Updated : Jul 30, 2024
ఆట సందీప్ మాత్రమే కాదు ఆయన భార్య జ్యోతి రాజ్ కూడా మంచి డ్యాన్సరే. ఇప్పటికే పలు టీవీ షోల్లో వీళ్ళు కలిసే కనిపిస్తారు. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వాళ్ళ డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు జ్యోతి రాజ్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె చేసిన మంచి పనికి అభిమానులు, నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. చాలా మంది ఇళ్లల్లో చూస్తే ఆడవాళ్లు ఇంటి పని, వంట పని, పిల్లల పని, ఉద్యోగం, హాబీస్ అన్నిట్లో ఉంటారు. కానీ ఇంట్లో మగవాళ్ళు, బయట మగవాళ్ళు చాలా చులకనగా చూస్తారు. వన్స్ పెళ్ళై పిల్లలు పుట్టారు అంటే ఆ మదర్స్ కి బాడీ వచ్చేస్తూ ఉంటుంది.
ఆ శరీరంతో ఇక నవ్వులపాలవుతూ ఉంటారు. ఇన్ని పనుల మధ్య మదర్స్ కి వ్యాయాయం చేసే టైం ఉండదు. ఇంట్లో పనులు చేస్తే చాలు రోజు గడిచిపోతూ ఉంటుంది. ఆ బాడీని చూసి అందరూ కామెంట్స్ చేస్తూ లావు తగ్గండి అంటూ సలహాలు ఇస్తారు. ఇప్పుడు జ్యోతిరాజ్ పరిస్థితి అలాగే ఉంది. ఎవరేమన్నారో కానీ వాళ్లకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చింది తన వీడియో ద్వారా. "రెస్పెక్ట్ విమెన్ - రెస్పెక్ట్ టాలెంట్" అని ఇంట్లో పనులు, డాన్స్ చేస్తూ, షూటింగ్స్ ఇలా అన్ని చేస్తూ ఉన్న వీడియో పోస్ట్ చేసి స్త్రీలను గౌరవించండి అని చెప్పింది. " అవును నేను ఆరోగ్యంగా,లావుగా ఉన్నాను ...ఎందుకంటే నేను పని చేసే మహిళను, బాధ్యతాయుతమైన మహిళను, భావోద్వేగాలు ఉన్న మహిళను..జాబ్ చేస్తూ ఇంట్లో పనులు చేయడం అనుకున్నంత ఈజీ ఏమీ కాదు. నేను నా పనికి విలువ ఇస్తాను, నా బాడీ స్ట్రక్చర్ కి నా అందానికి కాదు " అని పోస్ట్ చేసింది. ఇక జ్యోతి పెట్టిన ఈ కామెంట్ కి అందరూ రిప్లైస్ ఇస్తున్నారు. "ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు...మనపని మనం చేసుకుంటూ పోవాలి" అన్నారు.