English | Telugu

నాకూ ఉండుంటే బాగుండేది కదా అనిపిస్తోంది


త్వరలో ఫ్రెండ్ షిప్ డే రాబోతోంది. ఇక ఈ కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ రెడీ ఐపోయింది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఎవరి ఫ్రెండ్స్ తో వాళ్ళు వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఇక ఇందులో ఆది కనిపించలేదు. కానీ పంచ్ ప్రసాద్ చాన్నాళ్ల తర్వాత కనిపించాడు. ఇక ప్రసాద్ రాగానే ఇంద్రజ డైలాగ్ వేసింది " ప్రసాద్ గారు ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నానో తెలుసా" అనేసరికి "మళ్ళీ రవ్వొద్దు" అనా అండి అని ప్రసాద్ పంచ్ వేసాడు. దానికి ఇంద్రజ పెట్టింగ్ ఫేస్ మాములుగా లేదు. ఇక ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏమిటి అని ఇంద్రజ అడిగేసరికి "తాగి పడిపోతే ఇంటికి తీసుకెళ్లేవారు ఫ్రెండ్, పీకల్దాకా తాగించేవాడు బెస్ట్ ఫ్రెండ్" అంటూ ఒక నాటీ అర్ధం చెప్పాడు నాటీ నరేష్. తర్వాత ఆదర్శ్, అన్షు కలిసి "నీ స్నేహం" మూవీలోంచి ఫ్రెండ్ షిప్ సాంగ్ కి చాలా క్యూట్ గా డాన్స్ చేసారు.

ఇక ఆమె అతని ఫ్రెండ్ అని తెలీకుండా కొంతమంది ఆకతాయిలు వచ్చి "ఏముందిరా..ఎక్కడ పట్టాడోరా" అంటూ కామెంట్ చేసేసరికి ఆదర్శ్ వాళ్ళను కొట్టేసరికి "ఐనా దాన్ని కామెంట్ చేస్తే నీకెంటిరా" అని అడిగేసరికి "తాను నా ఫ్రెండ్ రా.." అని ఆదర్శ్ చెప్పాడు గట్టిగ. దానికి ఇంద్రజ రియాక్ట్ అయ్యింది. "మేల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరూ లేరు నాకు. కానీ ఈ పెర్ఫార్మెన్స్ చూసాక నాకు మేల్ ఫ్రెండ్స్ ఉంటే బాగుండనిపిస్తోంది" అని చెప్పింది.