English | Telugu
Guppedantha Manasu : వసుధారకి షాకిచ్చిన రిషి.. శైలేంద్రకి నిజం తెలిసేనా!
Updated : Jul 30, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1139 లో.. వసుధారకి రంగా ఇచ్చిన గిఫ్ట్ ఇస్తుంది రాధమ్మ. అది చూసిన వసుధార.. అసలు ఇందులో ఏముందని అనుకుంటూ ఓపెన్ చేస్తుంది. అందులో రంగానే రిషి అని చెప్పే జ్ఞాపకాలు ఉంటాయి. వసుధార, రిషి ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఇచ్చుకున్న గిఫ్ట్ లు ఉంటాయి. అవి చూసిన వసు హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరే రిషి సర్ ఆని నాకు తెలుసంటూ ఎమోషనల్ అవుతుంది. ఇంతకీ సర్ ఎక్కడికి వెళ్లారని వసుధార అనుకుంటుంది. మరోవైపు రిషిగా నటించడం కోసం శైలేంద్రతో రంగా వెళ్తాడు.
ఇక అక్కడ ఇంట్లోకి వెళ్ళిన రిషి.. జగతి ఫోటో చూస్తూ ఎమోషనల్ అవుతాడు. తన తల్లితో ప్రవర్తించిన తీరుని గుర్తుకుచేసుకుంటాడు. అందరు నేను లేను అంటున్నా నువ్వు ఒక్కదానివే నమ్మావు వసుధర అని రిషి అనుకుంటాడు. రిషిగా చేయలేని పనిని రంగాగా చేయడానికి వచ్చానమ్మ అని రిషి అనుకుంటుంటే.. అప్పుడే శైలేంద్ర వచ్చి ఈవిడ ఎవరో తెలుసా అని అంటాడు. రిషి వాళ్ళ అమ్మ జగతి అని శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత నీకు రిషి ఎలా మాట్లాడతాడో వాకింగ్ స్టైల్ అంత చెప్పాను కదా.. ఒకసారి చేసి చూపించు అనగానే రిషి చేసి చూపించగా శైలేంద్ర షాక్ అవుతాడు. అచ్చం మా రిషిలాగే చేసావని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత అందరి గురించి చెప్తానని శైలంద్ర అంటాడు. ఎవరో చెప్తే నాకెలా తెలుస్తుందని రిషి అంటాడు. అగు ఒక్క నిమిషం అంటు శైలేంద్ర వెళ్తుంటే.. ఎక్కడికి అని రిషి అంటాడు. నువ్వు కూడా నాతో రా అని రిషిని శైలేంద్ర తీసుకొని వెళ్తాడు.
ఆ తర్వాత వసుధార దగ్గరకి బుజ్జి వచ్చి.. VR లెటర్ గల అక్షరం ఇస్తాడు. అది చూసి వసుధార చాల హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత శైలేంద్రతో రిషి ఉన్న ఫోటోని బుజ్జి చూపించగా.. వసుధార షాక్ అవుతుంది. నా అనుమానమే నిజమే అయిందని వసుధార అనుకుంటుంది. అన్న ఈ సర్ తో వెళ్ళాడు.. అన్నని అతను రంగా అని పిలుస్తున్నాడు.. అన్నకి డబ్బులు కూడా ఇచ్చాడని బుజ్జి చెప్తాడు. నాతో ఏమైనా చెప్పమన్నాడ అని వసుధార అడుగుతుంది. ఈ ఫోటో చూపించు తనే అర్ధం చేసుకుంటుంది. ఏం చేయాలో తనకి తెలుసని అన్నట్టుగా బుజ్జి చెప్తాడు. ఇప్పుడు నాకు అర్థం అయింది. ఏం చెయ్యాలో నాకు తెలుసని వసుధార అంటుంది. మరొకవైపు రిషికి అందరి ఫోటోలు చూపిస్తాడు శైలేంద్ర. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.