English | Telugu
Karthika Deepam2 : శౌర్య గుండె వీక్ గా ఉంది.. కార్తిక్, దీప ఎమోషనల్!
Updated : Jul 30, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -109 లో... శౌర్య గురించి దీప బాధపడుతుంటే.. సుమిత్ర వచ్చి శౌర్యకి ఏం కాదంటూ ధైర్యం చెప్తుంది. మీరు పెద్ద మనసుతో శౌర్యని చూడడానికి వచ్చారు కానీ మీ మొహం చూసి మాట్లాడే దైర్యం చెయ్యలేకపోతున్నాను.. జ్యోత్స్న నిచ్చితర్థం ఆగిపోయింది నా వల్లే.. నా కూతురు గురించి నేనెంత బాధపడుతున్నానో నా వల్ల మీ కూతురు ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందని మీరు బాధపడుతున్నారని దీప అంటుంది.
ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది జ్యోత్స్న గురించి కాదు శౌర్య గురించి.. నరసింహ ఇక్కడికి రాలేదు కదా అని సుమిత్ర అడుగుతుంది. రాలేదని దీప అనగానే.. కచ్చితంగా నీ కూతురు కోసం వస్తాడు. అందరం ఉంటామని తెలుసు అయిన వచ్చాడు . ఇక్కడికి కూడా వస్తాడు. దీనికి కారణం నరసింహ కాదు నువ్వే.. నువ్వు వాడిని వదిలించుకోవట్లేదు.. వాడికి విడకులు ఇవ్వు.. అలా ఇస్తే మీ జోలికి రాడని సుమిత్ర అంటుంది. ఇప్పుడు మళ్ళీ కోర్ట్ చుట్టూ తిరగలేనని దీప అంటుంది.ఆ తర్వాత సుమిత్ర వెళ్ళిపోతు.. వేరే ఆలోచనలు పెట్టుకోకు. కార్తీక్ ఇక్కడే ఉన్నాడు.. వాడు చూసుకుంటాడని చెప్పి సుమిత్ర వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కార్తీక్ డాక్టర్ తో మాట్లాడతాడు. శౌర్య గుండె వీక్ గా ఉందని డాక్టర్ చెప్తాడు. తను భయపడే విషయాలు చెప్పొద్దని డాక్టర్ అంటాడు.
ఆ తర్వాత అన్నయ్య మళ్ళీ ముహూర్తం చూసుకొని ఎంగేజ్ మెంట్ పెట్టుకుందాం.. నువ్వు బాధపడకని కాంచన అంటుంటే జరుగుతుంది.. అంటావా అని పారిజాతం అంటుంది. దాంతో శివన్నారాయణ తనని తిడతాడు. అపుడే సుమిత్ర వస్తుంది. పాప గురించి అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత దీపకి నరసింహా కనబడతాడు. అదే విషయం వెళ్లి కార్తీక్ కి చెప్తుంది దీప. నరసింహా కోసం కార్తిక్ చూస్తాడు. అయిన కన్పించడు. ఆ తర్వాత డాక్టర్ ఏమన్నారని దీప అడుగుతుంది. దీపకి చెప్తే బాధపడుతుందని.. అంతా బాగుంది భయంతో అలా జరిగిందని చెప్తాడు. శౌర్య నేను చెప్పినవన్ని అబద్దాలు అనుకుంటుందని దీప ఏడుస్తుంది . ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.