English | Telugu
ఎమోషన్ సీన్స్ చేసేటప్పుడు రజనీకాంత్, విజయ్ సేతుపతిని గుర్తుచేసుకోండి
Updated : Jul 30, 2024
గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి సర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో ముఖేష్ రిషికి ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. ఐతే రిషి సర్ ని ఒక అభిమాని చిన్న సలహా ఇచ్చారు. "సార్ నేను ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను..సార్ మీరు ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ మీద ద్రుష్టి పెట్టాలి, ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు మీరు లుక్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు.. అందంగా కనిపించడం ముఖ్యం కాదు అన్ని సీన్లలో ఎమోషన్ పండించాలి.. అప్పుడే జనాలు మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ కనెక్షన్ లేకపోతె ఒక పాత్ర ఎలివేట్ అవ్వదు.. ఒకసారి మీరే చూడండి విజయ్ సేతుపతి , రజనీకాంత్ వంటి వాళ్ళు ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు తమ లుక్స్ గురించి పట్టించుకోరు కానీ వారు ఎమోషన్స్‌ని పండించేసి జనాలను ఆకట్టుకుంటారు.
మీరు కూడా అలా చేయాలని ఆశిస్తున్నాను.. అలా చేస్తే భవిష్యత్తులో బాగా రాణిస్తారు. " అంటూ అద్భుతమైన సలహా ఇచ్చారు. రిషి సర్ చూస్తే చాలు ఆడియన్స్ గుండెల్లో గులాబీలు పూసినట్టు ఫీలవుతారు. రిషి, వసుధార రోల్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరిని తెలుగు అడియన్స్ గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తారు. అటు సోషల్ మీడియాలో కూడా వీరికి మంచి ఫాలోయింగ్ ఉంది. మరి రిషి తన ఫ్యాన్ ఇచ్చిన సలహా చదివి ఫాలో అవుతాడా చూడాలి.