English | Telugu
ఆ తల్లీ కొడుకులు మళ్ళీ స్క్రీన్ మీదకు..ఖుషీలో ఫాన్స్
Updated : Jul 30, 2024
జానకి కలగనలేదు సీరియల్ లో అలనాటి అందాల నటి రాశి నటించిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు అమరదీప్ చౌదరి, కోడలిగా ప్రియాంక జైన్ నటించారు. ఐతే అమరదీప్ - రాశి బాండింగ్ చాలా క్యూట్ గా ఉంటుంది. రియల్ మదర్ అండ్ సన్ లా కనిపిస్తారు. ఐతే వీళ్ళు కలిసి ఒక షోలో కనిపించబోతున్నారు. ఆ పిక్స్ ని అమరదీప్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "మళ్ళీ ఇంకోసారి మా అమ్మతో స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నాను..థ్యాంక్యూ సో మచ్ అమ్మా..నువ్వు ఒక్క స్మైల్ ఇస్తే చాలు పాజిటివ్ ఎనెర్జీ వచ్చేస్తుంది..ఎప్పటికీ మా అమ్మ నా లైఫ్ లో నా వెన్నెముకలా నిలబడుతుంది" అని పోస్ట్ చేసాడు.
ఐతే బిగ్ బాస్ సెవెన్ లో అమర్ దీప్ హౌస్ మేట్ గా వెళ్ళినప్పుడు తన కొడుకు రామా అలియాస్ అమర్ దీప్ కి ఓటేయాలంటూ ఆడియన్స్ ని కోరుకుంది. జానకి కలగనలేదు సీరియల్‌లో రాశి జ్ఞానాంబగా నటించింది. రామాగా అమర్ దీప్, ఇక జానకిగా ప్రియాంక నటించింది. ఇలా రాశి అమరదీప్ కి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కలిసి మళ్ళీ స్క్రీన్ మీద కనిపించబోతున్నారనే విషయాన్ని అమరదీప్ పోస్ట్ చేసేసరికి నెటిజన్స్ కూడా ఫుల్ ఖుషీ ఐపోతున్నారు. "మాకు నచ్చిన తల్లీ కొడుకులు మీరు...మీ బాండింగ్ చాలా బాగుంటుంది. మిమ్మల్ని మళ్ళీ ఒక ఫ్రేమ్ లో చూడడం ఆనందంగా ఉంది.." అని కామెంట్స్ చేస్తున్నారు.