English | Telugu

శృతిమించిన సర్కార్ 4 లోని అర్థ నగ్న డ్యాన్స్.. మోతమోగిపోతుందిగా!


మోత మోగిపోద్ది అంటు శుభశ్రీ రాయగురు చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ నేడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. టీవీ షోలలో , ఓటీటీ వేదికలపై చూపించే అందాల ఆరబోత రోజు రోజుకి శృతిమించుతోందంటు నెటిజన్లు మండిపోతున్న వేళ తాజాగా విడుదలైన సర్కార్ 4 ( Sarkaar 4) సక్సెస్ పార్టీ ప్రోమో యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్న భామ శుభశ్రీ రాయగురు. తను హౌజ్ లో ఉన్నన్ని రోజులు డీసెంట్ గా హౌస్ మేట్స్ తో పాజిటివ్ గా ఉండేది. ఎక్కువ రోజులు గౌతమ్ కృష్ణతో కలసి ఉన్న ఈ భామ. 'దమ్ముంటే నామినేషన్ రీజన్ చెప్పు బ్రో.. నా మనోభావాలు దెబ్బతిన్నాయి' అంటు శుభశ్రీ నామినేషన్ లో చెప్పిన డైలాగ్స్ ఫుల్ వైరల్ అయ్యాయి. దాంతో బిగ్ బాస్ టైమ్ లో తను చెప్పిన ఈ మాటలని మీమర్స్ ఎక్కువగా ట్రోల్స్ లో వాడుకున్నారు. ఇక బిగ్ బాస్ తర్వాత అందరిని కలుస్తూ రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. ఇక ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ 4 ( Sarkaar 4) సక్సెస్ పార్టీ ప్రోమోలో అమర్ దీప్ తో కలిసి శూభశ్రీ చేసిన డ్యాన్స్ మోస్ట్ వాచెబుల్ గా నిలిచింది. సోషల్ మీడియాలో మోత మోగిపోతుంది.

సుడిగాలి సుధీర్ యాంకర్ గా చేస్తున్న ఈ సర్కార్ 4 ( Sarkaar 4) లో నిహారిక కొణిదెల, బాబా మాస్టర్ , ముక్కు అవినాష్, రోహిణి, సిరి, అమర్ దీప్ చౌదరి, ఫైమా, హమీద, వర్ష, ఇమ్మాన్యుయల్, యాదమ రాజు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ షోలో కొన్ని క్విజ్ కి సంబంధించిన ప్రశ్నలు ఉండగా.. మధ్య మధ్యలో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఉంటుంది. అయితే ఇందులో ఫీమేల్ డ్యాన్సర్స్ డ్రెస్సింగ్ మరీ దారుణంగా ఉంటుందంటు కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దాంతో పాటు తాజాగా విడుదలైన ప్రోమోలో అమర్ దీప్, శుభశ్రీ చేసిన డ్యాన్స్ కి ఇదేం షో రా బాబు అంటూ విశ్లేషకులు మండిపడుతున్నారు. మరి ఈ షోపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.