English | Telugu

Brahmamudi : పెళ్ళికి రెడీగా లేను.. అప్పు మనసులో ఏం ఉందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'( Brahmamudi ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -474 లో... కళ్యాణ్ ని కావ్య పిలిచి అప్పుని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. అయిన నీకు అప్పుపైన ప్రేమ ఏంటి? మీది స్వచ్ఛమైన స్నేహం మాత్రమే.. అదే విషయం మీ అన్నయ్య నమ్మడం లేదు.. మీరు అప్పుని ప్రేమిస్తున్నారని ఆయన నాతో వాదిస్తున్నారని కావ్య అంటుంది. ఇప్పుడు చెప్పండి మీరు అప్పుని ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది. అప్పు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటా అంతే అని కళ్యాణ్ అనగానే కావ్య రిలాక్స్ అవుతుంది. అయితే మీరు నాకూ ఇంకొక మాట కూడా ఇవ్వాలని కావ్య అనగానే ఏంటి పెళ్లి కి నేను రావద్దని చెప్తారా అని కళ్యాణ్ అంటాడు.

కాదు మీరు అమ్మ చెప్పిన పెళ్లి సంబంధం చేసుకోవాలి. అప్పుడే తను హ్యాపీగా ఎలాంటి డౌట్స్ లేకుండా ఉంటుందని కావ్య అంటుంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేనని కళ్యాణ్ అంటాడు. నాపై ఏ మాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పింది చేస్తారనుకుంటున్నానని కావ్య అంటుంది. ఆ తర్వాత రుద్రాణి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్లి.. ఇంట్లో ఎం జరుగుతుందో పట్టించుకుంటున్నావా.. నిన్న కావ్యకు ఒక పని అప్పజెప్పావ్.. అది ఎక్కడవరకు వచ్చిందో కనుక్కోవా అని అనగానే.. ధాన్యలక్ష్మి హాల్లోకి వెళ్లి అందరికి కాఫీ ఇస్తున్న కావ్యని పిలుస్తుంది. అయిన కావ్య పలకదు. ఏంటని ధాన్యలక్ష్మి అనగానే.. నేను ఇక్కడే ఉన్నాను కదా ఎందుకు అరుస్తున్నారని కావ్య అంటుంది. కళ్యాణ్ ని అడిగావా అని ధాన్యలక్ష్మి అనగానే.. అప్పుడే రాజ్ వస్తూ.. ఎవరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు.. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. కళ్యాణ్ మనసులో అప్పు ఉంది.. అందుకే కళ్యాణ్ కి అప్పు కి పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నానని రాజ్ అనగానే ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది. ఏంటి అప్పుని కళ్యాణ్ ప్రేమించడమేంటని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అదేం లేదు.. కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడని కావ్య అంటుంది. వెనకాల నుండి నెట్టి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అని ధన్యలక్ష్మి అంటుంది.

ఆ తర్వాత రాజ్ కళ్యాణ్ తీసుకొని వస్తాడు. చెప్పురా నీ మనసులో అప్పు ఉంది కదా చెప్పమని రాజ్ అనగా.. లేదని కళ్యాణ్ అంటాడు. ఇప్పుడు మీరందరు అనుకున్న సమాధానం వచ్చిందా అని కళ్యాణ్ కోప్పడతాడు. ఒరేయ్ నిన్న అప్పుకి పెళ్లి అంటే బాధపడ్డవ్ కదారా అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో అప్పు మనసులోణ కళ్యాణ్ మనసులో ఏముందో నీకు తెలుసు. నాకు తెలుసు. వాళ్ళకి తెలుసని రాజ్ అనగానే.. మరి అప్పు చెప్పిందా? అప్పు మనసేంటో తెలుసుకోండి అని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ కనకం దగ్గరికి వెళ్లి.. అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడని చెప్తాడు. కాసేపటికి నేను నా ఇష్టప్రకారమే ఈ పెళ్లి చేసుకుంటున్నానని రాజ్ తో అప్పు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.