English | Telugu

Eto Vellipoyindhi Manasu : భార్యకి ప్రపోజ్ చేసిన భర్త.‌. డిస్సప్పాయింట్ అయిందింగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -156 లో.. సీతాకాంత్ ఆఫీస్ స్టాఫ్ తో కలిసి లంచ్ చేస్తుంటాడు. అక్కడ పక్కనే కూర్చొని ఉన్నా రామలక్ష్మిని ప్రేమగా చూస్తాంటాడు. అది చూసి నమిత తననే చూస్తున్నాడని అనుకొని సిగ్గుపడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఫోన్ మాట్లాడుతు.. వెళ్ళిపోతే నమిత కూడా వెనకాలే వెళ్తుంది. సీతాకాంత్ పక్క నుండి పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే‌‌.. ఏంటి సర్ అక్కడ అలా చూసి ఇక్కడికి వచ్చాకా ఇలా చేస్తున్నారని నమిత అడుగుతుంది. నిన్ను చూడడమేంటి  నా భార్య రామలక్ష్మిని చూసాను.. నా మనసంతా తనపై ప్రేమ ఉందని సీతాకాంత్ అంటాడు. 

Guppedantha Manasu : జస్ట్ మిస్.. రంగానే రిషి అని శైలేంద్ర కనిపెట్టగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1134 లో.. శైలేంద్ర తను చూసింది వసుధారనో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి టీ షాప్ దగ్గరకి వెళ్తాడు. అక్కడ ఎవరు ఉండరు మరొకవైపు వసుధార తప్పించుకుంటుంది. రౌడీలు మళ్ళీ తప్పించుకుందంటూ టీ తాగుదాం పదండి అంటూ టీ షాప్ దగ్గరకి వెళ్తారు. ఇక అక్కడే ఉన్నా శైలేంద్ర పాండు గాడికి ఫోన్ చేసి వసుధారని చంపేశాడో లేదో కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ చేస్తాడు. పాండు ఫోన్ లిఫ్ట్ చేసి నేను కాకినాడలో కాజా కోసం వెళ్ళానని చెప్తాడు. అప్పుడే శైలేంద్ర, పాండు లు ఒకరికొకరు ఎదరుపడతారు.

Brahmamudi : శోభనం అక్కడే చేసేశాడు.. నాకు అంతా తెలుసు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -469 లో.. ఇందిరాదేవి అపర్ణ లు రాజ్ , కావ్యల శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. వీళ్ళేంటి ఇంకా రావడం లేదని అపర్ణ అనగానే.. ఇద్దరు డిన్నర్ అయిపోయాక సరదాగా తిరిగి వస్తారేమోనని ఇందిరాదేవి అంటుంది. ఇన్ని రోజులు చాలా పెద్ద తప్పు చేసాను అత్తయ్య.. కావ్యని అపార్ధం చేసుకొని బాధపెట్టాను ఇక నుండి నా కోడలు సంతోషం కోసం ట్రై చేస్తానని అపర్ణ అనగానే ఇందిరాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. మరొకవైపు మరుసటి రోజు ఉదయం.. రాజ్ నిద్ర లేచి కావ్య నుదుటిపైన ముద్దుపెట్టి తను కిందకి వెళ్తాడు. అక్కడ ఒకతను వచ్చి.. సర్ అరెంజ్మెంట్స్ ఎలా ఉన్నాయని అడుగుతాడు. నీ మొహంలా ఉన్నాయ్ తనని భయపెట్టమంటే నా పక్క నుండి వెళ్లి నన్ను భయపెట్టావని రాజ్ అంటాడు.

Brahmamudi : బుల్లితెరని హీటెక్కించేసిన రొమాన్స్.. పాత బంగ్లాలో శోభనం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -468 లో.. రాజ్, కావ్య రెస్టారెంట్ కి వెళ్తారు. కావ్యని రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చోబెట్టి.. రాజ్ ఆ హోటల్ మేనేజర్ దగ్గరకు వెళ్తాడు. చెప్పిందంతా గుర్తుంది కదా.. కేక్ టైమ్‌కి రావాలి. ఆ తర్వాత ఫుడ్.. తేడా రాకూడదని రాజ్ అంటాడు. సరే సర్ మీకెందుకు సర్.. మొత్తం నేను చూసుకుంటాను కదా.. మీరు వెళ్లండి కూర్చోండని అతను అంటాడు. అదే డైలాగ్ వాడతాడు రాజ్ జాగ్రత్తలు చెప్పిన ప్రతిసారీ. దాంతో రాజ్ కోపంగా.. హేయ్.. నాకెందుకు అంటావేంటయ్యా.. నాకే కావాలి.. నువ్వు సరిగ్గా చూసుకో.. సరే వెళ్తున్నానని కావ్య దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు రాజ్.

Karthika Deepam2 :  తండ్రి ఎఫైర్ ని కళ్ళారా చూసేసిన కొడుకు.. ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -103 లో..  కార్తిక్, దీప మాట్లాడుకుంటారు. జోత్స్నకి మీరంటే ప్రాణం.. మిమ్మల్ని తప్ప వేరొకర్ని భర్తగా ఊహించుకోలేదు.. చిన్నప్పటి నుంచి మీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.. మనం ప్రేమించే వాళ్లకంటే మనల్ని ప్రేమించే వాళ్లు మన జీవితంలోకి వస్తే జీవితం ఎంతో బాగుంటుంది.. ఈ పెళ్లి వద్దనడానికి మీ దగ్గర కారణాలు లేవు.. కానీ ఈ పెళ్లి చేసుకోవడానికి జోత్స్నకి వంద కారణాలు ఉన్నాయి.. మీ పెళ్లి అనేది మీ రెండు కుటుంబాల కల.. మేనకోడల్ని కోడల్ని చేసుకోవాలని మీ అమ్మ గారు ఎంత ఆరాటపడుతున్నారో నాకు తెలుసు కార్తీక్ బాబు.. మీ అమ్మగారిని సంతోషపెట్టడం కొడుకుగా మీ బాధ్యత.. అని కార్తిక్ తో దీప అంటుంది.

Eto Vellipoyindhi Manasu : సందీప్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రామలక్ష్మి.. సీతాకాంత్ అర్థం చేసుకోగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -155 లో.....రామలక్ష్మికి తన క్యాబిన్ చూపిస్తాడు సీతాకాంత్. నీకేం కావాలన్నా అలా చిటికెస్తే ఇలా వస్తాయని సీతాకాంత్ అంటాడు. సీతాకాంత్ ప్రేమగా చూస్తుంటే తన లవ్ మ్యాటర్ చెప్తాడేమో అని రామలక్ష్మి అనుకుంటుంది.  నువ్వు ఇంటిని బాగా చూసుకుంటున్నావ్.. ఈ కంపెనీని కూడా చూసుకుంటావని ఆశ పడుతున్నానని సీతాకాంత్ రామలక్ష్మికి అల్ ది బెస్ట్ చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ తన క్యాబిన్ లో నుండి రామలక్ష్మిని ప్రేమగా చూస్తుంటాడు.

దీపని కలిసిన కార్తీక్.. పెళ్లి చేసుకుంటాడా..?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -102 లో.... ఎంత రిక్వెస్ట్ చేసినా దీప వచ్చేలా లేదనుకొని తను హాస్పిటల్ లో ఇచ్చిన ఫోన్ , గాజులు తనకి ఇచ్చేద్దామని కార్తీక్ అవి పట్టుకొని దీప ఉంటున్న ఇంటికి వెళ్తాడు. కార్తీక్ వెళ్లేసరికి దీప ఇంటికి తాళం వేసి ఉంటుంది. కార్తీక్ పక్కింటి వారిని‌‌.. వీళ్ళు ఎక్కడికి వెళ్లారంటూ అడుగుతాడు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.. మళ్ళీరామని చెప్పారని వాళ్ళు చెప్పగానే.. కార్తీక్ డిజప్పాయింట్ అవుతాడు. నేను అనుకున్నదే చేసావ్ కదా దీప అని కార్తిక్ అనుకుంటాడు.