English | Telugu

కెమెరా ముందు అలా హగ్ చేసుకున్న నమిత!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -161 లో... సీతాకాంత్ ని రామలక్ష్మి ప్రేమగా చూస్తుంటే అప్పుడే కాఫీ పట్టుకొని మాణిక్యం వస్తాడు. కరెక్ట్ టైమ్ కి వస్తావని అతని పైన సీతాకాంత్ చిరాకు పడతాడు. రామలక్ష్మి నవ్వుకుంటుంది. అసలిప్పుడు నేనేం చేసానని మాణిక్యం అనుకుంటాడు. ఆ తర్వాత సర్ మీతో కలిసి బయటకు వెళ్లి చాలా రోజులు అవుతుంది.. సరదాగా అలా వెళదామా అని రామలక్ష్మి అడుగుతుంది. లేదు రామలక్ష్మి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని సీతకాంత్ చెప్తాడు. దాంతో రామలక్ష్మి డిస్సప్పాయింట్ అవుతుంది.

ఆ తర్వాత రామలక్ష్మికి నిజంగానే నా పైన ప్రేమ మొదలు అయినట్టుందని సీతాకాంత్ అనుకుంటాడు. అదే నిజం అయితే నా అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడని సీతాకాంత్ అనుకుంటాడు. మరొకవైపు మీరేం ప్లాన్ చేస్తున్నారో నాకు చెప్పండని శ్రీవల్లి అడుగుతుంటే.. శ్రీలత చెప్పదు. అప్పుడే నమితకి శ్రీలత ఫోన్ చేసి‌.. ఈ రోజే మన ప్లాన్ ని అమలు చేయమని చెప్తుంది. దాంతో ఈ రోజు నాకు భయంగా ఉందని నమిత అంటే.. తనపై శ్రీలత కోప్పడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ అన్ని మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని రామలక్ష్మితో బయటకు వెళ్ళాలని అనుకుంటాడు. తన దగ్గర కి వెళ్లి బయటకు వెళదామని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత నమిత కావాలనే ఫోన్ లో ఏడుస్తూ మాట్లాడుతుందిమ దంతో సీతాకాంత్ తన దగ్గరికి వచ్చి ఏమైందని అడుగుతాడు. నా భర్త వల్ల ప్రాబ్లమ్ సర్ అంటూ తన బాధని చెప్తుంది. మీరు చెప్తే అయిన వింటాడెమోనని నమిత అనగానే.. సరే నీ భర్తతో నేను మాట్లాడతానని సీతాకాంత్ అంటాడు. అదంతా మాణిక్యం చూస్తాడు.

ఆ తర్వాత సర్ ఇంకా రావడం లేదని రామలక్ష్మి తన క్యాబిన్ కి వెళ్తుంది. అప్పుడే మాణిక్యం రామలక్ష్మి దగ్గరికి వచ్చి.. ఆ నమిత పైన ఏదో డౌట్ ఉందని చెప్తాడు. ఆ తర్వాత నమిత తన ఇంటికి సీతాకాంత్ ని తీసుకొని వెళ్తుంది. తన భర్త లెటర్ రాసినట్టు తనే రాస్తుంది. ముందే కెమెరా ఆన్ చేసి పెడుతుంది. లెటర్ చూసి ఏడుస్తుంటే సీతాకాంత్ తన గదిలోకి వస్తాడు. అతను వెళ్లి పోయాడంటూ సీతాకాంత్ ని హగ్ చేసుకొని ఏడుస్తుంది నమిత. అదంతా కెమెరాలో రికార్డు అవుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఒకర్తే ఇంటికి వెళ్తుంది. ఏమైంది.. ఒకదానివే వచ్చావంటూ శ్రీలత అడుగుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఇంటికి వస్తాడు. బయటకు వెళదామని చెప్పి ఎక్కడికి వెళ్లారని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడు వెళదాం రెడీ అవ్వమని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.