English | Telugu

దీపకి మొదలైన కష్టాలు.. రెండో పెళ్ళి చేసుకున్ననరసింహం?

ఇదేందయ్యా ఇది.. ‌కార్తీక దీపం2 నవ వసంతంగా మొదలైన సంగతి తెలిసిందే. ఆయితే ప్రతీ సీను ప్రతీ షాటు మైండ్ పోతుంది లోపల అన్నట్టుగా ఈ సీరియల్ సాగుతుంది‌.‌ ప్రోమో వచ్చి అయిదు గంటలు కూడ ఆవ్వకముందే లక్ష వ్యూస్ దాటాయి. దీనికి ఓ కారణం ఉంది.

కార్తిక్ ఫారెన్ నుండి రావడం, దీపకి బహుమతి ఇస్తూ.. ఆ తప్పు నేను చేయలేదని చెప్పడంతో అసలు దీప భర్త కార్తిక్ అని అనుకున్నారంతా. కానీ దీప భర్త నరసింహం అని అతడిని వెతుక్కుంటూనే హైదరాబాద్ కి వచ్చిందని ప్రోమోలో తెలుస్తుంది. మరి శౌర్య పాప దీప, నరసింహంలకే పుడితే కార్తిక్ ని ఎలా కలుస్తుంది? కార్తిక్, దీపలు ఎలా పెళ్ళి చేసుకుంటారు. అసలు వీళ్ళు కలుస్తారా.. ఇది నవ వసంతంలా లేదు. పాత ప్రపంచంలా ఉంది. అయినా దీప పక్కన కార్తిక్ ని తప్ప ఎవరినీ ఊహించుకోని ప్రేక్షకులు ఈ ట్విస్ట్ ని ఎలా తీసుకుంటారో చూడాలి. అసలే కార్తిక్ , దీపలు కలవాలని మొదటి పార్ట్ ని చూస్తూ పూజలు, యాగాలు కూడా చేశారు. అయితే ఈ నవ వసంతంలోనైనా కలుస్తారా అంటే ఇప్పుడు దీప, నరసింహం భార్యభర్తలని రివీల్ చేశారు. ఇదెక్కడి అన్యాయం, ఇదేం సీరియల్ రా బాబు అంటూ ఆడియన్స్ ప్రోమో కింద కామెంట్లు చేస్తున్నారు.

కుబేరుడు చావు వెనకాల ఏదైనా కుట్ర ఉందా.. అసలు దీప, నరసింహాన్ని ఎప్పుడు పెళ్ళి చేసుకుంది. వాళ్ళ గతమేంటనే చాలా ప్రశ్నలతో ఈ సీరియల్ అర్థం కాకుండా సాగుతుంది. ఇప్పటికి మొదలై వారం రోజులైన సీరియల్ లో ఏం జరుగుతుందో ఎవరికి క్లారిటీ లేకుండా పోతుంది. దీప, కార్తిక్ లు కలుస్తారా లేదా అని చూసే ప్రేక్షకులకి దర్శకుడు మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్ ఇచ్చాడు. తాజాగా విడుదలైన కార్తీకదీపం2 ప్రోమో చూస్తే ఈ విషయం క్లారిటీ వస్తుంది. శౌర్య పాప పూల కోసం ఓ ఇంటి దగ్గరికి వెళ్ళి కోసుకొని రాగా ఆ ఇంటావిడ చూసి శౌర్యని కోప్పడుతుంది. చిన్నపిల్ల తెలియకుండా చేసిందని, మమ్మల్ని క్షమించమని చెప్పి దీప వెళ్తుంటే.. అప్పుడే నరసింహం.. ఎవరే అనుకుంటూ వస్తాడు. దీప వెనక్కి తిరిగి చూస్తుంది. నరసింహం నువ్వా.. నీకోసమే నేను హైదరాబాద్ వచ్చానని అంటుంది. ఇక నరసింహం రెండో భార్య.. అసలెవరిది అని అంటుంది. నేను నరసింహం భార్యని అని దీప అంటుంది. ఇంకో పెళ్ళి చేసుకొని నువ్వు హ్యాపీగా ఉన్నావ్.. నా బిడ్డకు నాకు ఎందుకు అన్యాయం చేశావు అని దీప ఏడుస్తూ అడుగుతుంది. ఆపవే నువ్వు.. నీ ఎదవ సోది అని నరసింహం అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.